Thursday, April 3, 2025

బిఎస్‌పితోనే బహుజనలకు రాజ్యాధికారం

- Advertisement -
- Advertisement -

ఇల్లందు : బహుజన సామాజ్‌వాది పార్టీతోనే బహుజనులకు రాజ్యాధికారం అందుతుందని ఆపార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ వెంకటేష్ చౌహన్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆదివారం స్ధానిక గోవింద్‌సెంటర్‌లోని పెన్షనర్స్‌భవన్‌లో ఏర్పాటుచేసిన బూత్‌కమిటీల సమీక్షా సమావేశానికి ముఖ్యఅతిధిగా హజరై మాట్లాడారు.

తెలంగాణలో నియంత పాలన కొనసాగుతుందని ఎంతోమంది విద్యార్థుల బలిధానాలతో సాధించుకున్న స్వరాష్ట్రంలో ప్రజలను అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారన్నారు. ఉద్యమ సమయంలో బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు అనే నినాదంతో ఎటుపోయిందని, నీళ్ళు, నిధులు, నియామకాలు ఎమయ్యాయన్నారు. గడిచిన తోమ్మిదేళ్ళ కాలంలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఏమి సాధించిందని దశాబ్ధి ఉత్సవాలు జరుపుకుంటుందో ప్రజలకు అర్ధం కావటంలేదన్నారు. రాష్ట్రంలో అణగారిన వర్గాల హక్కులకోసం ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ పోరాటం చేస్తున్నారని ఆయన నాయకత్వంలో రానున్న రోజుల్లో తెలంగాణలో బహుజన జెండా ఎగరవేస్తామన్నారు.

ఈ సమావేశంలో బిఎస్‌పి రాష్ట్ర కార్యవర్గసభ్యులు దయాకరన్ మౌర్య, ఐతరాజు అభయేందర్, జిల్లా అధ్యక్షుడు ఇర్పా రవికుమార్, ప్రధాన కార్యదర్శి గాడిద దామోదర్, జిల్లా మహిళా కన్వీనర్ బండి రమణి, నియోజకవర్గ అధ్యక్షుడు తచ్చోడి సత్యనారాయణ, నియోజకవర్గ ఇంచార్జ్ బాదావత్ ప్రతాప్, జిల్లా సీనియర్ నాయకులు రాయల శ్రీనివాస్‌రావు, పప్పుల గోపినాధ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News