Saturday, November 23, 2024

బహుజనులకు ముఖ్యమంత్రి పీఠం దక్కాలి: డా. ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్: రాబోయే ఎన్నికల్లో అగ్రకుల ఆధిపత్య పార్టీలను ఓడించి బహుజనులను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టాలనే ఏకైక లక్ష్యంతో బిఎస్పీ నిరంతరం పోరాడుతుందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. ఆదివారం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో గిరిజన శక్తి అధ్వర్యంలో ఏర్పాటు చేసిన ట్రైబల్ డిక్లరేషన్ రాష్ట్ర స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

బిసి,ఎస్సీ,ఎస్టీ, మైనారిటీలకు రాజ్యాధికారం దక్కేంతవరకు పేద ప్రజల పక్షాన తమ పార్టీ పోరాడుతుందన్నారు. రాబోయే ఎన్నికల్లో ఆధిపత్య పార్టీలు పెట్టే ప్రలోభాలకులోనై ఓట్లను అమ్ముకోవద్దన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజనులు,ఆదివాసీల హక్కులకు రక్షణ కల్పించే జీవో నెం.3 ను పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎస్సీ,ఎస్టీ ఉప ప్రణాళిక నిధులను దారి మళ్లించడం సరికాదన్నారు. అటవీ ప్రాంతాల్లో ఏళ్ల తరబడి పోడు భూములు సాగు చేసుకుంటున్న గిరిజనులతో పాటు, భూమిలేని అన్ని వర్గాల పేదలకు పట్టాలు కల్పించాలన్నారు. రాబోయే ఎన్నికల్లో గిరిజన డిక్లరేషన్‌ను ప్రతి తండాలో చర్చ జరగాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కో ఆర్డినేటర్ డా.ఎం.వెంకటేష్ చౌహాన్,రాష్ట్ర అధ్యక్షులు కొర్ర శరత్ నాయక్, ప్రకాష్ రాథోడ్,ప్రో.మంగు నాయక్, తుటా ఆర్గనైజింగ్ సెక్రటరీ ప్రో.రాజీవ్ పడియా, తెగా నాయకులు రామచందర్ నాయక్, సురేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News