Friday, September 20, 2024

బహుజనులంతా ఏకమై రాజ్యాధికారం సాధించాలి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : బహుజనులందరూ రాజకీయంగా ఏకమై రాజ్యాధికారం సాధిస్తే డా.బి.ఆర్.అంబేద్కర్ ఆశయాలను నెరవేరుతాయని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా చౌదర్ గూడ మండల తూంపల్లిలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డా.బి.ఆర్ అంబేద్కర్ చేసిన కృషితో దేశానికి గొప్ప రాజ్యాంగం సమకూరిందని అన్నారు. భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైన మానవ హక్కులు,స్వేచ్చ,సమానత్వం కల్పించారన్నారు.

బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనారిటీల హక్కుల కోసం నిరంతరం కృషి చేశారని అన్నారు. ఈ దేశంలోని కార్మికులు, మహిళలకు హక్కులు ప్రసాదించిన వ్యక్తి అని కొనియాడారు. తరతరాలుగా అణిచివేయబడ్డ వర్గాలకు ఓటు హక్కు కల్పించారని గుర్తు చేశారు.వచ్చే ఎన్నికల్లో ఓటు హక్కును నోట్లకు,మధ్యానికి అమ్ముకోకుండా ఆత్మగౌరవంతో ఓటు వేయాలన్నారు.డా.బి.ఆర్ అంబేద్కర్ ఆలోచనా విధానం నేటి తరానికి ఆదర్శప్రాయమన్న ఆయన కుల,మతాలకు అతీతంగా మనుషులందరిని సమానంగా గౌరవించకపోతే విగ్రహం పెట్టి అర్థం లేదన్నారు.అంబేద్కర్ ను విగ్రహాలకు పరిమితం చేయొద్దన్నారు.బహుజనులు రాజకీయంగా ఏకమైతేనే రాజ్యాధికారం సాధిస్తామన్నారు. అంతకు ముందు మార్గమాధ్యలో కొందుర్గులో డా.బి.ఆర్.విగ్రహానికి పూలమాలలు వేసి ర్యాలీ నిర్వహించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News