Wednesday, January 8, 2025

వాచ్‌మెన్ హత్య… కాళీమాతకు రక్తాన్ని అర్పించి

- Advertisement -
- Advertisement -

పాట్నా: వాచ్‌మెన్‌ను హత్య చేసి అనంతరం కాళీమాతకు రక్తాన్ని సమర్పించిన సంఘటన బిహార్‌లోని బైకుంఠపుర్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గోపాల్‌గంజ్‌లో పోలీస్ స్టేషన్‌లో జమీంద్ర రాయ్‌ను అనే వ్యక్తి వాచ్‌మెన్‌గా పని చేస్తున్నాడు. బైకుంఠపుర్‌లో ఓ పెళ్లి వేడుకకు హాజరై వస్తుండగా అర్థరాత్రి దుండగులు అతడిని కత్తులతో పొడిచి హత్య చేశారు. అనంతరం రక్తాన్ని కాళీమాతకు అర్పించారు. సోన్‌వాలియా డ్యామ్‌కు 50 మీటర్ల దూరంలో వాచ్‌మెన్ మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాళీమాతకు వాచ్‌మెన్‌ను బలి ఇచ్చి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News