Monday, December 23, 2024

ఎంఎల్‌ఎల కొనుగోలు కేసులో నిందితులకు బెయిల్ తిరస్కరణ

- Advertisement -
- Advertisement -

 

మనతెలంగాణ/హైదరాబాద్ : ఎంఎల్‌ఎల కొనుగోలు కేసులో నిందితుల బెయిల్ పిటిషన్‌ను నాంపల్లి ఎసిబి కోర్టు తిరస్కరించింది. నిందితులు దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం కోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా పోలీసుల తరఫున న్యాయవాది వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం నిందితుల బెయిల్‌ను తిరస్కరించింది. దర్యాప్తు సందర్భంలో బెయిల్ ఇస్తే ఆటంకం ఎదురవుతుందన్న న్యాయవాది వాదనతో ఏకీభవించిన కోర్టు.. నిందితుల బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది. ప్రస్తుతం నిందితులు రామచంద్రభారతి, నందకుమార్, సింహయాజీలు చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు.

పీటీ వారెంట్ దాఖలు

ఎంఎల్‌ఎల కొనుగోలు కేసులో నిందితుడిగా ఉన్న నందకుమార్‌పై పోలీసులు పీటీ వారెంట్ కోరారు. ఈ మేరకు నాంపల్లి కోర్టులో బంజారాహిల్స్ పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేశారు. ఇప్పటికే నందకుమార్‌పై బంజారాహిల్సళ్ పోలీసు స్టేషన్‌లో రెండు కేసులు నమోదు కాగా, కేసు దర్యాప్తులో భాగంగా విచారించేందుకు నందకుమాఱ్ అరెస్ట్‌కు అనుమతించాలని పోలీసులు కోరారు. ఎంఎల్‌ఎల కొనుగోలు కేసులో ఏ2గా ఉన్న నందకుమార్, ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. పీటి వారెంట్‌కు నాంపల్లి కోర్టు అనుమతిస్తే పోలీసులు నందకుమార్‌ను విచారించనున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News