Friday, December 20, 2024

కోడికత్తి కేసు.. శ్రీనివాస్‌కు బెయిల్‌

- Advertisement -
- Advertisement -

కోడికత్తి కేసు నిందితుడు శ్రీనివాస్ కు ఎట్టకేలకు బెయిల్ మంజూరైంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శ్రీనివాస్ కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ నిరాకరిస్తూ విశాఖ ఎన్ఐఏ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కూడా రద్దు చేసింది. రూ. 25 వేలు పూచీకత్తుతో 2 షూరిటీలు సమర్పించాలని అధిష్టానం ఆదేశించింది. కేసు గురించి మీడియాతో మాట్లాడవద్దని హైకోర్టు తెలిపింది. ప్రతి ఆదివారం ముమ్మిడి పోలీస్ స్టేషన్ లో హాజరుకావాలని ఆదేశించింది. దాదాపు ఐదేళ్ల తర్వాత కోడి కత్తి కేసు నిందితుడికి బెయిల్ లభించింది. నిందితుడు శ్రీనివాస్ ఐదేళ్ల పాటు జైలులోనే మగ్గిన విషయం తెలిసిందే. 2018 అక్టోబర్ 25 న విశాఖ ఎయిర్ పోర్టులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కోడికత్తి దాడి జరిగింది. ఐదేళ్లపాటు సాక్ష్యం చెప్పేందుకు కూడా జగన్ కోర్టుకు హాజరుకాలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News