పట్నం నరేందర్‌రెడ్డి సహా 25మందికి మంజూరు
రూ.50వేల పూచీకత్తు
సమర్పించాలని పట్నం
నరేందర్‌రెడ్డికి నాంపల్లి
స్పెషల్ కోర్టు ఆదేశం
రూ. 20వేల పూచీకత్తు
చెల్లించాలని రైతులకు ఆదేశం
ఎ2 సురేష్‌కు దక్కని బెయిల్..
నేడు వాదనలు కొడంగల్
నియోజకవర్గం లగచర్లలో
కలెక్టర్‌పై దాడి కేసులో
నిందితులకు ఊరట
నెలరోజులుగా జైలులోనే
మన తెలంగాణ/హైదరాబాద్: లగచర్లలోకలెక్ట ర్, ఉన్నతాధికారులపై దాడి ఘటన కేసులో రైతులకు బెయిల్ మంజూరు అయింది. దాడికి ప్లాన్ చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న కొడంగల్ మాజీ ఎంఎల్‌ఎ, బిఆర్‌ఎస్ నేత పట్నం నరేందర్‌రెడ్డికి సైతం బెయిల్ మంజూరు చేశారు. నాం పల్లి స్పెషల్ కోర్టు మొత్తం 25 మందికి బెయిల్ మంజూరు చేసింది. న్యాయమూర్తి వీరికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. పట్నం నరేందర్ రెడ్డి రూ.50 వేల పూచీకత్తు సమర్పించాలని, రైతులు రూ.20 వేల పూచీకత్తూ సమర్పించాలని కోర్టు ఆదేశించింది. వికారాబాద్ జి ల్లా కొడంగల్ నియోజకవర్గం లగచర్లలో కలెక్ట ర్, పోలీస్ ఉన్నతాధికారులపై దాడి జరగడం సంచలనంగా మారింది.
దీనిపై కేసు నమోదు చే సిన పోలీసులు మాజీ ఎంఎల్‌ఎ నరేందర్‌రెడ్డితో పాటు పలువురు రైతులను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. దాదాపు నెలకు పైగా జైల్లోనే రైతులు, పట్నం నరేందర్ రెడ్డి ఉన్నారు. ఇటీవల రైతులకు బేడీలు అనే విషయం వివాదాస్పదమైంది. ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో రాష్ట్రవ్యాప్తంగా విమ ర్శలు వెల్లువెత్తాయి. పట్నం నరేందర్ రెడ్డి మూ డు నెలలపాటు ప్రతి బుధవారం పోలీస్ స్టేషన్ కు వెళ్లి సంతకం చేయాలని ఆదేశాలు జారీ చేశా రు. ఈ కేసులో మొత్తం 26 మంది అరెస్ట్ కాగా, 25 మందికి నాంపల్లి స్పెషల్ కోర్టు బెయిల్ ఇ చ్చిందని న్యాయవాది జక్కుల లక్ష్మణ్ వెల్లడించారు. 3 నెలల వరకు పోలీసులు దర్యాప్తుకు స హకరించాలని ఆదేశిస్తూ కోర్టు నిందితులకు బె యిల్ మంజూరు చేసింది. ఎ2 సురేష్‌కు బెయిల్ మంజూరు కాలేదు. గురువారం సురేష్ బెయిల్‌పై వాదనలు జరగనున్నాయి.