- Advertisement -
న్యూఢిల్లీ : బీహార్ మాజీ ముఖ్యమంత్రి , ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు, ఆయన భార్య రబ్రీదేవికి, కుమార్తె , ఎంపీ మిసా భారతికి ల్యాండ్ ఫర్ జాబ్ కేసులో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఒక్కొక్కరికి రూ. 50,000 వ్యక్తిగత పూచీకత్తుపై ఢిల్లీ లోని రౌజ్ అవెన్యూ కోర్టు బెయిల్ ఇచ్చింది. ఈ కేసు విచారణ మార్చి 29 కి వాయిదా వేసింది. ఈ కేసులో బెయిల్ పిటిషన్‌పై విచారణ కోసం నిందితులు ముగ్గురూ కోర్టుకు హాజరయ్యారు. లాలూ యాదవ్ వీల్ ఛైర్‌లో కోర్టుకు వచ్చారు. రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో రైల్వేశాఖలో ఉద్యోగాలు ఇచ్చేందుకు కొంతమంది నుంచి తక్కువ ధరకే భూములు కొన్నట్టు లాలూ కుటుంబీకులపై ఆరోపణలున్న సంగతి తెలిసిందే .
- Advertisement -