Thursday, January 23, 2025

మనీలాండరింగ్ కేసులో సంజయ్ రౌత్‌కు బెయిల్

- Advertisement -
- Advertisement -

ముంబై : పత్రా చాల్ రీడెవలప్‌మెంట్ ప్రాజెక్టుకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో శివసేన నాయకుడు, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ బెయిల్ దరఖాస్తును ముంబైలోని ప్రత్యేక పీఎంఎల్‌ఏ కోర్టు బుధవారం అనుమతించింది. దీంతో అతనికి బెయిల్ మంజూరైంది. ఇందులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రవీణ్ రౌత్‌కు కూడా ఈ కేసులో బెయిల్ లభించింది. ఒక్కొక్కరికి రూ. 2 లక్షల బెయిల్ బాండ్‌ను కోర్టు విధించింది. సబర్బన్ గోరెగావ్‌లోని పాత్ర చాల్ (రో టెన్‌మెంట్) పునరాభివృద్ధికి సంబంధించి మనీలాండరింగ్ ఆరోపణలపై రౌత్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఈ ఏడాది జూలైలో అరెస్టు చేసిన ముచ్చట తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News