Monday, December 23, 2024

యుపికేసులో జుబెయిర్‌కు బెయిల్

- Advertisement -
- Advertisement -

Bail for Zubair in UP case

న్యూఢిల్లీ : అల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకులు జర్నలిస్టు మెహమ్మద్ జుబెయిర్‌కు సుప్రీంకోర్టు శుక్రవారం ఐదురోజుల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టేలా ఆయన రాతలు ఉన్నాయని ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్ జిల్లాలో దాఖలు అయిన కేసుకు సంబంధించి ఈ తాత్కాలిక ఊరట దక్కింది. ఇందిరా బెనర్జీ, జెకె మహేశ్వరితో కూడిన వెకేషన్ బెంచ్ జుబెయిర్ పిటిషన్‌పై యుపి అధికార యంత్రాంగం వివరణకు నోటీసు వెలువరించింది. తదుపరి విచారణ రెగ్యులర్ బెంచ్ జరుపుతుందని పేర్కొంది. అయితే ఇప్పటి ఐదురోజుల బెయిల్ కేవలం సీతాపూర్ ఎఫ్‌ఐఆర్‌కు సంబంధించిందేనని , ఢిల్లీలో దాఖలు అయిన కేసుకు దీనికి సంబంధం లేదని, ఈ కేసు విషయం తేలే వరకూ ఆయన ఢిల్లీ వదిలివెళ్లరాదని ధర్మాసనం తెలిపింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News