Friday, December 20, 2024

ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో బెయిల్ మంజూరు

- Advertisement -
- Advertisement -

విచారణకు ముందే ఇంతకాలం జైల్లో ఉంచరాదు: సుప్రీం

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో మనీలాండరింగ్ ఆరోపణలతో అరెస్టయి జైలుపాలైన లిక్కర్ దిగ్గజ కంపెనీ పర్మోద్ రికార్డ్ ఎగ్జిక్యూటివ్ బినయ్ బాబుకు సుప్రీంకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. విచారణ ప్రారంభానికి ముందే ఎక్కువ కాలం నిందితులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి) జైలులో ఉంచరాదని సుప్రీంకోర్టు తన ఉత్వర్వులో పేర్కొంది. ఈ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నిందితుడైన బినయ్ బాబుకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.

నిందితుడు గడచిన 13 నెలలుగా జైలులో ఉన్నాడని, ఈ కేసులో విచారణ ఇంకా మొదలు కావలసి ఉందని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్‌విఎన్ భట్‌తో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఈ కేసులో మరింత మంది నిందితులను అరెస్టు చేయవలసి ఉందన్న ఇడి, సిబిఐ వాదనలను ప్రస్తావిస్తూ ఆ రెండు దర్యాప్తు సంస్థలు చేస్తున్న ఆరోపణలు భిన్నంగా ఉన్నాయని ధర్మాసనం తెలిపింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News