Friday, December 27, 2024

జానీ మాస్టర్ కు బెయిల్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్‌పై లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు ఊరట లభించింది. తాజాగా హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. తోటి కొరియోగ్రాఫర్ పై అత్యాచారం ఆరోపణ ఎదుర్కొంటున్న కేసులో జానీ మాస్టర్ కు జస్టిస్ శ్రీదేవి బెయిల్ మంజూరు చేశారు. గత రెండు వారాలుగా ఆయన చంచల్ గూడా జైల్లో ఉంటున్నారు. టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తనపై లైంగిక వేదింపులకు పాల్పడ్డాడంటూ ఆయన వద్ద అసిస్టెంట్‌గా పనిచేస్తున్న యువతి(21) నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం విధితమే. దీంతో  సెప్టెంబర్ 19న జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ బాషను సైబరాబాద్ ఎస్‌ఓటి పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ముంబయిలో ఓ సినిమా చిత్రీకరణ నిమిత్తం జానీ మాస్టర్‌తోపాటు తాను, మరో ఇద్దరు సహాయకులం వెళ్లామని, అక్కడ హోటల్లో తనపై జానీ మాస్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడని ఫిర్యాదులో వివరించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News