Saturday, March 22, 2025

పోసానికి బెయిల్ మంజూరు

- Advertisement -
- Advertisement -

ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళికి ఊరట కలిగింది. గుంటూరు కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. సిఐడి నమోదు చేసిన కేసులో పోసానికి బెయిల్ లభించింది. పోసాని బెయిల్ పిటిషన్‌పై గుంటూరు కోర్టు బుధవారం విచారణ జరిపి తీర్పును శుక్రవారానికి వాయిదా వేసింది. తిరిగి శుక్రవారం విచారణ జరిపి బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గుంటూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసాని, తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ న్యాయవాదుల ద్వారా సిఐడి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై కోర్టు తీర్పును వాయిదా వేసింది. కాగా, పోసానిని ఫిబ్రవరి 26న హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. ఎపిలో ఆయనపై 19 కేసులు నమోదైనట్టు తెలుస్తోంది. అవార్డులకు సంబంధించిన సినీ పరిశ్రమలో విద్వేషాలు రగిల్చే వ్యాఖ్యలు చేశారని చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్‌లపై అనుచిత

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News