Monday, December 23, 2024

బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ కు బెయిల్

- Advertisement -
- Advertisement -

ఎట్టకేలకు బిగ్ బాస్-7 విన్నర్ పల్లవి ప్రశాంత్ కు బెయిల్ లభించింది. బిగ్ బాస్ ఫినాలే తర్వాత జరిగిన సంఘటనల నేపథ్యంలో పల్లవి ప్రశాంత్ ను అతని సోదరుడిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నాంపల్లి శుక్రవారం పల్లవి ప్రశాంత్ కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర పల్లవి ప్రశాంత్ అభిమానుల పేరుతో కొంతమంది విధ్వంసం చేశారు. ఆర్టీసీ బస్సుతో సహా పలు వాహనాలను ధ్వంసం చేశారు. ఈ దాడి ఘటనలో పోలీసులు పల్లవి ప్రశాంత్ A-1గా పేర్కొంటూ అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం పోలీసుల విచారణకు హాజరుకావాలని కోర్టు ఆదేశించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News