Monday, December 23, 2024

బెయిన్ క్యాపిటల్ చేతికి అదానీ క్యాపిటల్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : అదానీ గ్రూప్‌కు చెందిన నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు(ఎన్‌బిఎఫ్‌సి) అయిన అదానీ క్యాపిటల్, అదానీ హౌసింగ్‌లో 90 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నామని ఆదివారం అమెరికా ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ బెయిన్ క్యాపిటల్ ప్రకటించింది. ఈ డీల్ విలువ రూ.1600 కోట్లు ఉంటుందని అంచనా. ఈ ఒప్పందం కింద బెయిన్ క్యాపిటల్ అదానీ కుటుంబ ప్రైవేటు పెట్టుబడులు అన్నింటిని కొనుగోలు చేయనుంది.

ఈ లావాదేవీ ఈ సంవత్సరం నాలుగో త్రైమాసికం ముగిసే నాటికి ముగియనుంది. అదానీ క్యాపిటల్ రుణ కార్యకలాపాలను విస్తరించి స్వతంత్ర సంస్థగా తీర్చిదిద్దడమే ఈ ఒప్పందం లక్షంగా ఉంది. కంపెనీలో మిగతా 10 శాతం వాటా అదానీ క్యాపిటల్ వద్దనే ఉండనుంది, అయితే ఈ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్, సిఇఒగా గౌరవ్ గుప్తానే కొనసాగనున్నారు. అదానీ క్యాపిటల్ వృద్ధికి గాను 120 మిలియన్ డాలర్లకు బెయిన్ కంపెనీ కట్టుబడి ఉంది.

నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ రూపంలో అదనంగా 50 మిలియన్ డాలర్లను అందివ్వనుంది. గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్‌కు చెందిన అదానీ క్యాపిటల్ ఒక ఎన్‌బిఎఫ్‌సి సంస్థ, ఈ కంపెనీ 2017లో సేవలను ప్రారంభించింది. ఈ డీల్ పట్ల గౌతమ్ అదానీ సంతోషం వ్యక్తం చేశారు. బెయిన్ వంటి అద్భుత కంపెనీ తోడ్పాటు అందివ్వడంపై వ్యాపారాన్ని బహుళ రెట్లు పెంచేందుకు దోహదం చేస్తుందని అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News