Monday, January 20, 2025

వరంగల్‌లో బైరి నరేష్‌ అరెస్ట్.. కొడంగల్‌కు తరలింపు

- Advertisement -
- Advertisement -

వరంగల్: అయ్యప్ప స్వామి, ఇతర హిందూ దేవుళ్లపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన నాస్తికుడైన బైరి నరేష్‌ను తెలంగాణ వ్యాప్తంగా అయ్యప్ప స్వామి భక్తుల నుంచి తీవ్ర నిరసనల నేపథ్యంలో పోలీసులు అరెస్ట్ చేశారు. వరంగల్‌లో బైరి నరేష్‌ను అరెస్టు చేసిన పోలీసులు వికారాబాద్‌ ఎస్పీ కార్యాలయానికి తరలించనున్నట్లు సమాచారం.

అంతకుముందు, నరేష్ రెండు రోజుల క్రితం కొడంగల్ నియోజకవర్గంలో జరిగిన బహిరంగ సభలో అయ్యప్ప స్వామి, ఇతర హిందూ దేవుళ్లపై కించపరిచే వ్యాఖ్యలు చేసిన ముచ్చట తెలిసిందే. ఆయన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన అయ్యప్ప స్వామి భక్తులు ఆయనపై ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ 1950ని నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు చేస్తున్నారు. నాలుగు బృందాలను రంగంలోకి దించిన పోలీసులు అతడిని వెతికి ఎట్టకేలకు వరంగల్‌లో అరెస్టు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News