Wednesday, January 22, 2025

బెయిర్‌స్టో అజేయ శతకం

- Advertisement -
- Advertisement -

Bairstow ton takes England to 258/7

ఇంగ్లండ్ 258/7, యాషెస్ సమరం

సిడ్నీ: యాషెస్ సిరీస్‌లో భాగంగాఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. శుక్రవారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి బెయిర్‌స్టో 103 (నాటౌట్) క్రీజులో ఉన్నాడు. అయితే ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ స్కోరును అందుకోవాలంటే ఇంగ్లండ్ మరో 158 పరుగులు చేయాలి. 13/0 ఓవర్‌నైట్ స్కోరుతో శుక్రవారం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్లు హసీబ్ (6), జాక్ క్రాలి (18) జట్టుకు శుభారంభం అందించడంలో విఫలమయ్యారు. మరోవైపు జట్టును ఆదుకుంటాడని భావించిన కెప్టెన్ జో రూట్ (౦) ఖాతా తెరవకుండానే పెవిలియన్ చరాడు. వన్‌డౌన్‌లో వచ్చిన డేవిడ్ మలాన్ (3)కూడా నిరాశ పరిచాడు. దీంతో ఇంగ్లండ్ 36 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది.

ఈ దశలో బెన్ స్టోక్స్, జానీ బెయిర్‌స్టోలు జట్టును ఆదుకున్నారు. ఇద్దరు ప్రత్యర్థి బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ఇన్నింగ్స్‌ను కుదుట పరిచారు. ఒకవైపు వికెట్‌ను కాపాడుకుంటూనే చెత్త బంతులను బౌండరీలుగా మలుస్తూ ముందుకు సాగారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన బెన్ స్టోక్స్ 9 ఫోర్లు, సిక్సర్‌తో 66 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో ఐదో వికెట్‌కు కీలకమైన 128 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. మరోవైపు జోస్ బట్లర్ (0) పరుగులేమి చేయకుండానే వెనుదిరిగాడు. కానీ మార్క్‌వుడ్ అండతో బెయిర్‌స్టో పోరాటం కొనసాగించాడు. మార్క్‌వుడ్ మూడు సిక్సర్లు, రెండు ఫోర్లతో 39 పరుగులు చేశాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన బెయిర్‌స్టో మూడు సిక్స్‌లు, 8 ఫోర్లతో 103 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతనికి జాక్ లీచ్ 4 (బ్యాటింగ్) అండగా ఉన్నాడు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News