Tuesday, December 24, 2024

బీమా పథకాలను వితరణ చేసే ఒడంబడికను(టై-అప్) ప్రకటన..

- Advertisement -
- Advertisement -

ఆంధ్రప్రదేశ్: ప్రముఖ ప్రైవేటు సాధారణ బీమా చేసేవారిలో ఒకరైన బజాజ్‌ అలియాన్జ్‌ జనరల్‌ ఇన్స్యూరెన్స్‌, రాష్ట్రంలో ఖాతాదారులను కేంద్రంగా చేసుకుని పనిచేస్తున్న ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్‌ అయిన ఆంద్రప్రదేశ్‌ ప్రగతి గ్రామీణ బ్యాంక్‌, బజాజ్‌ అలియాన్జ్‌ జనరల్‌ ఇన్స్యూరెన్స్‌ పథకాలను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని 500 కంటే ఎక్కువ శాఖలలో 3 సంవత్సరాల వ్యవధికి ఒక కార్పొరేట్‌ ఏజెన్సీ ఒప్పందాన్ని ప్రకటించాయి. రాష్ట్రంలోని గ్రామీణ ప్రజానీకానికి తమ ఈ వర్గంలో అత్యుత్తమమైన పథకాలను, సేవలను అందజేయడం ద్వారా వారికి చేరుకోవాలని ఈ భాగసామ్యం లక్ష్యంగా పెట్టుకున్నది.

ఈ వ్యూహాత్మక ఒప్పందం క్రింద, బజాజ్‌ అలియాన్జ్‌ జనరల్‌ ఇన్స్యూరెన్స్‌ బీమా రంగంలో ప్రముఖ బీమా పథకాలు, ఆరోగ్యం, గృహ, మోటారు, ట్రావెల్‌ లాంటి వాటిని, మిగిలిన వాటితో పాటుగా లాంగ్‌ టర్మ్‌ డ్వెల్లింగ్‌ ఇన్స్యూరెన్స్‌, పర్సనల్‌ యాక్సిటెండ్‌ కవర్స్‌ పై ప్రత్యేక దృష్టి పెట్టి బ్యాంకు యొక్క ఖాతాదారులను ఆర్ధిక పరంగా సంరక్షించడానికి, అందజూపుతున్నది.

భాగస్వామ్యంపై వ్యాఖ్యానిస్తూ, రాకేషన్‌ కాశ్యప్ చైర్మన్‌-ఆంద్రప్రదేశ్‌ ప్రగతి గ్రామీణ బ్యాంక్‌ ఇలా అన్నారు. బజాజ్ తో మా భాగస్వామ్యం గురించి మేము ఆనందంగా ఉన్నాము. ఉద్వేగభరితయ్యాము, ఈ భాగస్వామ్యం ఎంతో సుదూరతీరాలకు వెళుతుందని నేను ఆశిస్తున్నాను. భాగస్వాములు ఇద్దరూ ఈ వ్యాపారంలో చక్కటి అనుభవాన్ని పొందగలరు. ఇంకా, బజాజ్ వారి ఖాతాదారుకు తగ్గట్లుగా రూపొందించబడిన బీమా పథకాలు బ్యాంకు యొక్క గ్రామీణ ప్రాంతాలలోని ఖాతాదారులకు బీమా వ్యాపారం ద్వారా మరింత సన్నిహితంగా అవగలము.

ఈ భాగస్వామ్యంపై మాట్లాడుతూ.. రోహిత్‌ జైన్, హెడ్-జియో డిస్ట్రిబ్యూషన్, బజాజ్‌ అలియాన్జ్‌ జనరల్‌ ఇన్స్యూరెన్స్‌ ఇలా అన్నారు. “బీమా చాలా కీలకమైన అంశం, ఇది అనిశ్చితమైన అత్యవసర సమయాలలో ఆర్ధికంగా ఉపశమనాన్నిఅందజేస్తుంది. అయితే, బీమా ప్రజల మనసులలోనికి చొచ్చుకుపోవడం ఇప్పటికీ సాపేక్షికంగా తక్కువగానే ఉన్నది. దీని కారణంగా బీమా చేసే వారు బీమా యొక్క ప్రయోజనాలను దేశంలోని ప్రతి ఇంటికి పెంచే దిశగా అహర్నిశలు శ్రమిస్తూనే ఉన్నారు. బలమైన వితరణ, ఆర్ధిక సంస్థలతో దృఢమైన భాగస్వామ్యాలు, దూరతీరాలలో ఉన్న ఖాతాదారులను చేరుకోవడంలో సహాయపడడానికి వీలుగా మరియు వారి అవసరాలకు తగ్గట్లుగా ఉన్న పథకాలను వారికి అందజూపడం, మాకు అవసరం.”

ఆంద్రప్రదేశ్‌ ప్రగతి గ్రామీణ బ్యాంక్‌ వారి విస్తృత శ్రేణి నెట్‌వర్క్‌ ద్వారా రాష్ట్రం యొక్క ఆర్ధిక పురోగతికి, ఆర్ధిక పథకాలు, సేవలను, ప్రత్యేకించి గ్రామీణ ప్రజాకానికి అందజేయడం ద్వారా, విశిష్టమైన పాత్రను పోషించింది. బ్యాంకుతో మా భాగస్వామ్యం విశిష్టమైనది, వారి ఖాతాదారులకు, గ్రామీణ ప్రజానీకానికి ప్రత్యేకంగా రూపొందించబడిన విశ్వసనీయమైన బీమా పరిష్కారాలను అందజూపడంలో సహాయపడుతుంది, ఆవిధంగా వారి ఆర్ధిక స్థిరత్వాన్ని మొత్తం మీద భద్రపరచడానికి ఇవి మాకు సహాయపడతాయి. దీనికి అదనంగా, రాష్ట్ర ప్రజానీకానికి బీమా అవగాహనను కల్పించడంలో ఈ భాగస్వామ్యం వీలుకలిగిస్తుందని మేము నిశ్చయించుకుంటాము. ఈ ప్రాంతపు ప్రతి నగరానికి, ప్రతి పట్టణానికి వారికి ఈ రంగంలో అత్యుత్తుమ ఖాతాదారుల అనుభవాన్ని మా అద్వితీయమైన డిజిటల్ నవీనతలతో అందజేస్తూ ఖాతాదారుడు కేంద్రంగా బీమా పరిష్కారాలను అందజూపడానికి సానుకూలతతో మేము ముందుకు వెళుతున్నాము.

ఈ వ్యూహాత్మకమైన కలయిక రాష్ట్రంలో బీమా పథకాల శ్రేణిని ప్రజలలోనికి చేర్చడాన్ని మెరుగుపరుచడం, అవగాహన కల్పించడం లక్ష్యంగా చేసుకున్నది. టెక్నాలజీని ఉపయోగించుకుని ఖాతాదారుని అనుభవాన్ని పునఃనిర్వచించడంపై మేము ఏకాగ్రతతో దృష్టిపెడతాము.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News