Friday, January 24, 2025

మొదటి జీఎఫ్‌ఐని నిర్వహించనున్న బజాజ్‌ అలయంజ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌..

- Advertisement -
- Advertisement -

పుణే: దేశంలోని ప్రముఖ ప్రైవేట్ జనరల్ ఇన్సూరెన్స్‌ కంపెనీల్లో ఒకటైన బజాజ్ బజాజ్ అలయంజ్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ బీమా పరిశ్రమలో మొట్టమొదటిసారి జనరల్ ఇన్సూరెన్స్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (GIFI)ని నిర్వహిస్తోంది. ఈ ఒక్క రోజు వేడుకలో ప్రఖ్యాత వక్తల ప్రేరణాత్మక సందేశాలు, లైఫ్‌స్టైల్ జోన్, ప్రఖ్యాత సంగీత స్వరకర్త ప్రీతమ్ లైవ్ పెర్ఫామెన్స్, హాస్యనటుడు సునీల్ గ్రోవర్ వినోద విభావరి సహ మరెన్నో సరదా కార్యక్రమాలు ఉంటాయి. వేడుకలో భాగంగా “GIFI అవార్డ్స్‌” వేడుక ఉంటుంది. ఈ GIFI అవార్డు కోసం పరిశ్రమవ్యాప్తంగా ఉన్న హెల్త్‌, జనరల్‌ ఇన్సూరెన్స్‌ ఏజెంట్లు తమ పేర్లు నామినేట్‌ చేసుకోవచ్చు. ఈ ఈవెంట్ జూలై 3, 2023న పూణేలో జరుగుతుంది.

భారతదేశంలో అత్యధిక రేటింగ్ పొందిన సాధారణ బీమా ఏజెంట్లను గుర్తించేందుకు, సాధారణ బీమా పరిశ్రమ పట్ల వారి కృషి, అభిరుచిని గౌరవించేందుకు భారతదేశంలో GIFI అవార్డ్స్‌ను కంపెనీ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి న్యాయనిర్ణేతలుగా స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఎస్ ప్రకాష్, జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మాజీ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి ఆలిస్ జి. వైద్యన్, ఐఆర్‌డిఎఐ మాజీ సభ్యుడు శ్రీ నీలేష్ సాఠే వ్యవహరిస్తారు.

జనరల్‌, హెల్త్‌ ఇన్సూరెన్స్ పరిశ్రమ నుంచి దిగువ తెలిపిన కేటగిరీలలో తమను తాము నామినేట్‌ చేసుకోవాలని అడ్వైజర్లను కంపెనీ ఆహ్వానిస్తోంది.

1. భారతదేశంలో ఉత్తమ హెల్త్‌ ఇన్సూరెన్స్ అడ్వైజర్‌
2. భారతదేశంలో ఉత్తమ మోటర్‌ ఇన్సూరెన్స్ అడ్వైజర్‌
3. భారతదేశంలో ఉత్తమ ప్రాపర్టీ ఇన్సూరెన్స్ అడ్వైజర్‌
4. భారతదేశంలో ఉత్తమ మల్టీలైన్‌ ఇన్సూరెన్స్ అడ్వైజర్‌
5. భారతదేశంలో ఉత్తమ మహిళా ఇన్సూరెన్స్ అడ్వైజర్‌

GIFI అవార్డుల కోసం మిమ్మల్ని లేదా మీకు తెలిసిన సలహాదారును నామినేట్ చేయడానికి మీరు https://www.generalinsurancefestivalofindia.com/ వెబ్‌సైట్‌లో ఉన్న నామినేషన్ ఫామ్‌ను ఆన్‌లైన్‌లో పూరించవచ్చు. నామినేషన్లు 14 జూన్ 2023 నుంచి మొదలవుతాయి. ఇక్కడ పేర్కొన్న అర్హత ప్రమాణాల ప్రకారం ఏజెంట్లు బహుళ వర్గాల కోసం నామినేషన్లు దాఖలు చేయవచ్చు. 23 జూన్, 2023 గడువులోపు ఏజెంట్లు ఫామ్ పూరించి కేటగిరీ ప్రకారం కేవలం వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. ఇందు కోసం కంపెనీ ఒక ప్రముఖ ఇండిపెండెంట్‌ ప్రాసెస్‌ రివ్యూయర్‌ను భాగస్వామిగా కంపెనీ ఎంచుకుంది. వీరు నామినేషన్లకు సంబంధించిన మదింపులో ఆమోదం నుంచి విధానాల వరకు ప్రతీ దశలోనూ సహకరిస్తారు. మా గౌరవనీయ జ్యూరీ ప్యానెల్ ఎంట్రీలను సమీక్షించి, తదనుగుణంగా ఈవెంట్ విజేతను నిర్ణయిస్తుంది. GIFI అవార్డు విజేతలు, రన్నరప్‌లను 3 జూలై, 2023న పూణేలో జరిగే GIFI ఈవెంట్‌లో సత్కరించి అవార్డులు అందజేయబడతాయి.

దీన్ని ప్రారంభిస్తూ బజాజ్ అలయంజ్ జనరల్ ఇన్సూరెన్స్ ఎండీ & సీఈఓ శ్రీ తపన్ సింఘేల్, “బీమా పరిశ్రమకు వెన్నెముక వంటి వారు సలహాదారులు. కస్టమర్లకు ఉత్తమ సలహాలు అందించడానికి, కష్టకాలంలో వారికి అండగా నిలుస్తూ వారికి మార్గనిర్దేశం చేస్తారు. సమాజంలో నిజమైన మార్పును తెచ్చే ఈ సలహాదారుల కృషిని గుర్తించడంతో పాటు దానిని వేడుకగా జరుపుకోవాలని మేము భావిస్తున్నాం. దీన్ని దృష్టిలో ఉంచుకుని మేము భారతదేశపు మొట్టమొదటి జనరల్ ఇన్సూరెన్స్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాను (GIFI) రూపొందించాము, ఇందులో భాగంగా మేము అలాంటి ఉత్తమ సలహాదారులను GIFI అవార్డుల ద్వారా గౌరవిస్తాం. మొదటి సంవత్సరం మేము కంపెనీతో సంబంధం లేకుండా ఈ రంగంలోని ఉత్తమ ఏజెంట్లను సత్కరించి వేడుకలు జరుపుకోవాలని కోరుకుంటున్నాము. ఈ అవార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలని, వారి కఠోర శ్రమ, అంకితభావాన్ని వేడుకగా జరుపుకునేందుకు మాతో చేరాలని సలహాదారులను మేము ప్రోత్సాహిస్తున్నాం. ఈ అవార్డుల కోసం ఏర్పాటు చేసిన జ్యూరీ ప్యానెల్‌లో పరిశ్రమ దిగ్గజాలు ఉన్నారు. ఈ మదింపులో వారికి ఒక ఇండిపెండెంట్‌ ప్రాసెస్‌ రివ్యూయర్‌ సహకరిస్తారు” అని అన్నారు.

సాధారణ బీమా పరిశ్రమను దేశంలోని ప్రతీ మూలకు చేర్చడంలో సాయపడుతున్న వివిధ సంస్థలు, ఈ రంగానికి చెందిన సలహాదారులతో కలిసి జనరల్ ఇన్సూరెన్స్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా నిర్వహించేందుకు బజాజ్‌ అలయంజ్‌ ఎంతో ఆనందిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News