బజాజ్ ఆటో అత్యంత సరసమైన చేతక్‌ను మార్కెట్లో విడుదల చేసింది. చేతక్ 2901 బ్యాడ్జ్‌తో వస్తున్న ఈ ఇ-స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధర రూ.95,998 గా ఉంది. ఇది చేతక్ అర్బన్, ప్రీమియం వేరియంట్‌ల కంటే దిగువన ఉంది. ఈ నేపథ్యంలో బజాజ్ చేతక్ 2901 గురుంచి పూర్తిగా ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.
బజాజ్ చేతక్ 2901 స్టైలింగ్ చేతక్ ఇతర వేరియంట్‌ల మాదిరిగానే ఉంటుంది అని చెప్పవచ్చు. అయితే, బజాజ్ బోల్డ్ కలర్స్‌ను ప్రవేశపెట్టింది. ఇది యువతనే కాకుండా అన్ని మధ్య వయసు గల వ్యక్తులను ఆకట్టుకుంటుంది. కాగా, చేతక్ 2901 నాలుగు రంగులలో లభిస్తుంది అవి – ఎరుపు, తెలుపు, నలుపు, యెల్లో, అజూర్ బ్లూ.
స్పెసిఫికేషన్లు
బజాజ్ అనేక ఫీచర్లతో స్కూటర్‌ను తయారు చేసింది. ఇది కలర్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కూడా కలిగి ఉంది. ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీని కూడా ఉంది. కస్టమర్‌లు TecPacని కూడా కొనుగోలు చేయవచ్చు. బజాజ్ చేతక్ 2901 హిల్ హోల్డ్, రివర్స్ మోడ్, స్పోర్ట్, ఎకానమీ మోడ్‌లు, కాల్, మ్యూజిక్ కంట్రోల్స్, ఫాలో మి హోమ్ లైట్లు, బ్లూటూత్ యాప్ కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఉన్నాయి.
ARAI సర్టిఫికేషన్ ప్రకారం..చేతక్ 2901 ఒక్కసారి ఛార్జ్ చేస్తే..123 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేయగలదని బజాజ్ పేర్కొంది. అయితే, వాస్తవ ప్రపంచంలో దీని పరిధి కాస్త తక్కువగా ఉండబోతోంది అని తెలుస్తోంది. కాగా, చేతక్ 2901 బుకింగ్ భారతదేశంలోని కంపెనీకి చెందిన 500 షోరూమ్‌లలో ప్రారంభమైంది. ప్రస్తుత భారతీయ మార్కెట్లో ఈ స్కూటర్ TVS iQube, Ather Rizta, Ola S1X, Ola S1 ఎయిర్‌లకు గట్టి పోటీగా ఉంటుంది.