- Advertisement -
రికవరీ ఏజెంట్ వేధించినందుకు ఆర్‌బిఐ చర్యలు
న్యూఢిల్లీ : ఆర్థిక సేవల కంపెనీ బజాజ్ ఫైనాన్స్‌పై ఆర్‌బిఐ రూ.2.25 కోట్ల జరిమానా విధించింది. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్సియల్ కంపెనీ ఆర్‌బిఐ (భారతీయ రిజర్వు బ్యాంక్) నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను సెంట్రల్ బ్యాంక్ ఈ చర్యలు తీసుకుంది. రుణం వసూళ్లలో భాగంగా రికవరీ ఏజెంట్ వేధింపులకు పాల్పడ్డారని, ఎఫ్‌పిసి (ఫేర్ ప్రాక్టీస్ కోడ్) నిబంధనలను పాటించడంలో విఫలమైందని రిజర్వు బ్యాంక్ పేర్కొంది. నిబంధనల ఉల్లంఘనకు పాల్పడ్డందుకు గాను చర్యలు తీసుకున్నామని ఆర్‌బిఐ పేర్కొంది. కంపెనీ చేపడుతున్న రికవరీ, వసూళ్ల విధానంపై తరచూ ఫిర్యాదులు వస్తున్నాయని నోటిఫికేషన్‌లో సెంట్రల్ బ్యాంక్ వెల్లడించింది.
Bajaj Finance fined Rs 2.25 crore
- Advertisement -