Monday, December 23, 2024

రూ. 50,000 కోట్లు దాటిన బజాజ్ ఫైనాన్స్ ఎఫ్‌డీలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఎన్‌బిఎఫ్‌సి సంస్థ బజాజ్ ఫిన్‌సర్వ్‌కు చెందినన బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల(ఎఫ్‌డి) ఖాతాలు రూ.50,000 కోట్ల మైలురాయిని దాటాయి. బజాజ్ ఫైనాన్స్‌కు 5 లక్షల మందికి పైగా వినియోగదారులు ఉన్నారు. ప్రతి డిపాజిటర్ 2.87 డిపాజిట్లను, మొత్తంగా 14 లక్షల డిపాజిట్లను కలిగి ఉన్నారు.

బజాజ్ ఫైనాన్స్ 44 నెలల కాల వ్యవధితో కూడిన ఎఫ్‌డిలపై అత్యధిక వడ్డీ రేట్లు సీనియర్ సిటిజన్లకు 8.60 శాతం, ఇతరులకు 8.35 శాతం అందిస్తోంది. క్రిసిల్, ఐసిఆర్‌ఎ, కేర్, ఇండియన్ రేటింగ్స్ ద్వారా తమ దీర్ఘకాలిక రుణ కార్యక్రమం నిమిత్తం అత్యున్నతమైన ఎఎఎ, స్టేబుల్ క్రెడిట్ రేటింగ్‌ను బజాజ్ ఫైనాన్స్ కలిగి ఉంది.

ఫిక్స్‌డ్ డిపాజిట్స్ ఎఎంపి, ఇన్వెస్ట్‌మెంట్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్- సచిన్ సిక్కా మాట్లాడుతూ, ఆకర్షణీయమైన వడ్డీ రేట్లతో వినియోగదారులకు దీర్ఘకాలిక పొదుపు పరిష్కారాలను అందించడంపై దృష్టి కేంద్రీకరించామని అన్నారు. సంస్థ ఫిక్స్‌డ్ డిపాజిట్ల పోర్ట్ ఫోలియో రెండేళ్ళలో రెట్టింపైన వృద్ధి బజాజ్ ఫైనాన్స్ బ్రాండ్‌పై వినియోగదారుల నమ్మకాన్ని చూపిస్తోందని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News