- Advertisement -
న్యూఢిల్లీ : జూన్ ముగింపు నాటి మొదటి త్రైమాసిక ఫలితాల్లో బజాజ్ ఫైనాన్స్ నికర లాభం రూ.1002 కోట్లు నమోదు చేసింది. ఇది గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.962 కోట్లుగా ఉంది. దీంతో సంస్థ లాభం వార్షిక ప్రాతిపదికన 4 శాతం పెరిగింది. నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ) 8 శాతం పెరిగి రూ .4,489 కోట్లకు చేరుకుంది. గతేడాదిలో రూ.4,152 కోట్ల ఆదాయం ఉంది. కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయంలో స్వల్ప పెరుగుదల నమోదవగా, ఇది రూ .6,648 కోట్ల నుండి రూ .6,742 కోట్లకు పెరిగింది. జూన్ త్రైమాసికంలో ఆదాయం రూ.5,900 కోట్లు నమోదవగా, గతేడాదిలో ఇది రూ.5,793 కోట్లుగా ఉంది. ఇక మార్చి త్రైమాసికంలో ఆదాయం రూ.6000 కోట్లు నమోదైంది. అంటే కంపెనీ ఆదాయాలు త్రైమాసిక ప్రాతిపదికన తగ్గుముఖం పట్టాయి.
- Advertisement -