Monday, December 23, 2024

‘భజే వాయు వేగం‘ ప్రేక్షకుల్ని అలరిస్తుంది

- Advertisement -
- Advertisement -

యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్ బ్యానర్‌పై హీరో కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటిస్తున్న సినిమా ‘భజే వాయు వేగం‘. ఐశ్వర్య మీనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్ టైసన్ కీలక పాత్రను పోషిస్తున్నాడు. ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ కథతో దర్శకుడు ప్రశాంత్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ‘భజే వాయు వేగం‘ సినిమాను ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ శుక్రవారం దేశవ్యాప్తంగా విడుదల చేస్తోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో శర్వానంద్ మాట్లాడుతూ “కార్తికేయ మాస్, యాక్ష న్, ఎమోషన్, కామెడీ అన్ని జోనర్స్ చేయగలడు.

కార్తికేయ ఆల్ రౌండర్. ‘భజే వాయు వేగం‘ తప్పకుండా ప్రేక్షకుల్ని అలరిస్తుంది”అని పేర్కొన్నారు. డైరెక్టర్ ప్రశాంత్ రెడ్డి మాట్లాడు తూ “భజే వాయు వేగం సినిమాలో రాహుల్ టై సన్ తన పర్‌ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంటాడు. కార్తికేయ లేకుంటే ఈ సినిమా ఉండేది కాదు”అని అన్నారు. హీరో కార్తికేయ మాట్లాడుతూ “దర్శకుడు ప్రశాంత్ నేను కోరుకున్న అంశాలున్న కథతో ‘భజే వాయు వేగం‘ సినిమాను తెరకెక్కించాడు. సినిమా ట్రైలర్ చూసి రొటీన్‌గా ఉందని అనుకుంటే, కథలో ఎమోషన్స్ ఉంటేనే రొటీన్ అనుకుంటే మనం వెనక్కు వెళ్తున్నట్లు. ప్రేక్షకులకు ఎమోషన్స్, వ్యాల్యూస్ ఉన్న ఒక సినిమా చూపించాలి. అలాంటి మంచి సినిమా భజే వా యు వేగం”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో దర్శకులు మేర్లపాక గాంధీ, వశి ష్ట, క్లాక్స్, హీ రోయిన్ ఐశ్వర్య మీనన్, తనికెళ్ల భరణి, మధు శ్రీనివాస్, సత్యజి, రామజోగయ్య శాస్త్రి, నాగ మహేశ్, కృష్ణ చైతన్య, సుదర్శన్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News