Thursday, January 23, 2025

తార్నాక ఆసుపత్రిలో ఒపి సర్వీసులను ప్రారంభించాం: బాజిరెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాఖీ పండుగ రోజున అత్యధిక ఆదాయానికి కృషిచేసిన (20.10 కోట్లు) సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లకు, సంస్థ సిబ్బందికి ప్రతి ఒక్కరికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నానని టిఎస్ఆర్ టిసి చైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆర్టిసి సంస్థను గాడిలో పెట్టేందుకు సంస్థ చైర్మన్, నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు.  ఆయన పదవి బాధ్యతలు చేపట్టిన నుండి అనేక సంస్కరణలు అమల్లోకి తెచ్చారు.  ఆయన పదవి బాధ్యతలు చేపట్టి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా నూతనంగా మరిన్ని సంస్కరణలను అమలు చేయనున్నారు.

సంస్థ నష్టాల్లో ఉన్నందున ఆయన జీతభత్యాలు కూడా సంస్థ కోసం వదులుకున్నారని,  టిఎస్ ఆర్టిసి చైర్మన్ గా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ప్రయాణికుల అభిరుచునులకు అనుగుణంగా కొత్త కొత్త పథకాలను అమలు చేస్తున్నారు. ఫాదర్స్ డే, మదర్స్ డే, చిల్డ్రన్స్ డే, జాతీయ పండగలను దృష్టిలో ఉంచుకొని పెద్దలకు ప్రత్యేక రాయితీలతో, పిల్లలకు ఉచితంగా బస్సు సౌకర్యాన్ని అందిస్తామన్నారు.  తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆశీస్సులతో వచ్చే ఆర్థిక సంవత్సరానికి అన్ని ఆర్టిసి డిపోలను లాభాల్లోకి తీసుకురావాలన్న లక్ష్యంతో మరిన్ని నూతన సంస్కరణలను టిఎస్ ఆర్టిసి సంస్థలో అమలు చేయనున్నారు.

టిఎస్ ఆర్టిసి చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సంస్థ అభివృద్ధికై అయన నిరంతరం కృషి చేస్తానన్నారు. టిఎస్ ఆర్టిసి సంస్థ చేపట్టిన, చేపట్టబోయే సంస్కరణలను ఆయన వివరించారు.

2021 – 2022 సంవత్సరంలో చేపట్టిన సంస్కరణలు ..

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం ఆర్టిసి బస్సులోనే 9.7.2022 నుంచి తిరుపతికి టిఎస్ఆర్ టిసి బస్సుతో పాటు దర్శన టిక్కెట్లను బుక్ చేసుకునే అవకాశం కల్పించడం జరిగిందని తెలిపారు. ప్రతిరోజు తిరుపతికి 1,000 మంది ప్రయాణికులను తీసుకెళ్లడం జరిగిందన్నారు.

నిజామాబాద్ నగరంలో నూతనంగా ఆర్టిసి మినీ సిటీ బస్ సర్వీసులు ప్రారంభించుకోవడం జరిగిందని,  నారాయణపేట జిల్లా కోస్గి లో నూతనంగా బస్ స్టేషన్, డిపోలను ప్రారంభించామని, మెదక్ జిల్లా నర్సాపూర్ లో నూతనంగా బస్టాండ్, బస్ డిపోలను ప్రారంభించుకోవడం జరిగిందని వివరించారు. తార్నాక ఆస్పత్రి ప్రాంగణంలో బిఎస్సీ నర్సింగ్ కళాశాల, ఇంటర్ ఒకేషనల్ కళాశాల ను ప్రారంభించుకోవడం జరిగిందని వెల్లడించారు.

మారుతున్న కాలానికి అనుగుణంగా సంస్థ క్యూఆర్ కోడ్ ద్వారా టిఎస్ఆర్ టిసి డిజిటల్ చెల్లింపులు ప్రారంభించుకోవడం జరిగిందని,  దీని వల్ల చిల్లర కష్టాలు తొలగిపోయాయని పేర్కొన్నారు.  రాష్ట్రంలోని ప్రధాన బస్ స్టేషన్లలో ప్రయాణికుల కోసం టాయిలెట్లు ఉచితంగా చేయడం జరిగిందని, టిఎస్ఆర్ టిసి అన్ని బస్ స్టేషన్లకు టాయిలెట్లు విస్తరిస్తామని చెప్పారు. ప్రయాణికులకు ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా మెరుగైన వసతులు కల్పిస్తామన్నారు.

టిఎస్ ఆర్టిసి చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ఆర్టిసి తార్నాక ఆసుపత్రిని అధునాతన హంగులతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. నూతనంగా ఇంటర్ ఒకేషనల్ కళాశాలను ప్రారంభించామని, నిరుపేద కుటుంబాలను దృష్టిలో ఉంచుకొని తార్నాక ఆసుపత్రిలో ఒపి సర్వీసులను ప్రారంభించామని, తార్నాక ఆస్పత్రిలో 200 పడకల బెడ్ లను ఏర్పాటు చేయడం జరిగిందని, డయాలసిస్ పేషెంట్లకు నాలుగు బెడ్ లను ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, తార్నాక ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంటును చైర్మన్ ప్రారంభించారన్నారు. ఐసియు 15, ఎమర్జెన్సీ 05 యూనిట్ లను ఏర్పాటు చేశామని వివరించారు. తార్నాక ఆసుపత్రిలో రెండు అంబులెన్సు సర్వీసులను చైర్మన్ ప్రారంభించారు.  ఆస్పత్రిలో 24 గంటల ఫార్మసీ సేవలు అందుబాటులో ఉంటాయని బాజిరెడ్డి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News