- Advertisement -
భువనేశ్వర్: ఒడిశా రాష్ట్రం బజ్‌పూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి బారాబతి బ్రిడ్జి పైనుంచి కిందపడిపోవడంతో ఐదుగురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఎస్‌సిబి మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. 50 మంది ప్రయాణికులతో బస్సు పూరీ నుంచి కోల్‌కతాకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనపై ఓడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతులకు రూ.3 లక్షల పరిహారం ఇస్తామని ప్రకటించారు.
VIDEO | Several injured as bus falls off flyover in Odisha's Jajpur. More details awaited. pic.twitter.com/gmg0EPXRs3
— Press Trust of India (@PTI_News) April 15, 2024
- Advertisement -