Tuesday, April 8, 2025

బిజెపి నెత్తిన బజరంగ్‌బలి గద: సంజయ్ రౌత్

- Advertisement -
- Advertisement -

ముంబై: కర్నాటకలో బిజెపి ఓడిపోవడం అంటే ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా ఓడిపోయినట్లేనని శివసేన(ఉద్ధవ్ బాలాసాహెబ్ థాక్రే) నాయకుడు సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. హనుమంతుడి గద బిజెపి నెత్తిన పడిందని ఆయన విలేకరులతో అన్నారు.

‘ఇది మోడీ, షా ఓటమి’ అని రౌత్ అన్నారు. కర్నాటకలో ఇప్పుడు సంభవించినట్లే 2024 లోక్‌సభ ఎన్నికల్లో కూడా సంభవిస్తుందన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికలకు ఈ కర్నాటక ఎన్నికల ఫలితాలు ఓ పాయింటర్ అని ఆయన తెలిపారు. కర్నాటకలో కాంగ్రెస్ విజయం ఒకవిధంగా చెప్పాలంటే దక్షిణాది నుంచి ఆ పార్టీని తుడిచేసినట్లే. మరో విధంగా చెప్పాలంటే 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఊతం ఇచ్చే ఫలితం ఇదని చెపొచ్చు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News