Tuesday, April 1, 2025

కాంగ్రెస్ కార్యాలయాన్ని ధ్వంసం చేసిన బజరంగదళ్ కార్యకర్తలు

- Advertisement -
- Advertisement -

జబల్‌పూర్ : మధ్యప్రదేశ్ లోని జబల్‌పూర్ సిటీలో కాంగ్రెస్ కార్యాలయాన్ని గురువారం బజరంగ్‌దళ్ కార్యకర్తలు ధ్వంసం చేశారు. ఈ సంఘటన కు సంబంధించిన వీడియో వైరల్ అయింది. కర్ణాటక ఎన్నికల మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ ఇలాంటి హిందుత్వవాద సంస్థలపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ఈ సంస్థలు ద్వేషాన్ని ప్రేరేపిస్తున్నాయని ఆరోపించింది. ఈ మ్యానిఫెస్టోపై సంఘ్ పరివార్ నుంచి తీవ్ర నిరసన పెల్లుబికింది.

అంతకు ముందు రోజు స్థానిక బజరంగ దళ్ విభాగం బల్‌దేవ్ బాగ్ ఏరియాలో కాంగ్రెస్ కార్యాలయం ముందు నిరసన చేపడతామని హెచ్చరించింది. గురువారం 30 నిమిషాల సేపు నిరసన చేపట్టిన తరువాత బజరంగ్‌దళ్ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యాలయం లోకి చొరబడి ధ్వంసం చేశారు. ఈ విధ్వంసానికి పాల్పడిన దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక కాంగ్రెస్ ఎమ్‌ఎల్‌ఎలు, నాయకులు, కార్యకర్తలు కొత్వాల్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి డిమాండ్ చేశారు. అయితే సిటీ పోలీస్‌లు దీనిపై ఎలాంటి వ్యాఖ్య చేయలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News