Sunday, December 22, 2024

హిందూ బాలికతో స్నేహం: ముస్లిం యువకుడిపై దాడి (వైరల్ వీడియో)

- Advertisement -
- Advertisement -

న్యూస్‌డెస్క్: హిందూ అమ్మాయి, ముస్లిం అబ్బాయి కలిసి పార్కులో కనిపించి బజరంగ్ దళ్ కార్యకర్తల ఆగ్రహానికి గురయ్యారు. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిన్‌లో శుక్రవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. లవ్ జిహాద్‌ను ప్రోతహిస్తున్నాడని ఆరోపిస్తూ ఆ ముస్లిం యువకుడిపై బజరంగ్ దళ్ కార్యకర్తలు దాడి చేశారు.

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తమను వదిలివేయాలంటూ ఆ బాలిక వేడుకుంటుండగా ముస్లిం యువకుడిని బజరంగ్ దళ్ సభ్యులు ప్రశ్నించడాన్ని ఈ వీడియోలో చూడవచ్చు. మేమిద్దరం కేవలం స్నేహితులం మాత్రమేనని ఆ బాలిక ఎంత వేడుకుంటున్నప్పటికీ నీ మొబైల్‌లో ముస్లిం యువకుడి ఫోటో ఎందుకు ఉందంటూ హిందూత్వ కార్యకర్తలు ఆమెను నిలదీయడాన్ని చూడవచ్చు.

ఈ సంఘటనపై మాధవ్ నగర్ పోలీసు స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ విలేకరులతో మాట్లాడుతూ ఫిర్యాదు ఇవ్వడానికి ఆ బాలిక నిరాకరించిందని చెప్పారు. తాము స్నేహితులమని ఆ బాలిక చెప్పిందని, ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడానికి నిరాకరించిందని ఆయన తెలిపారు. ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చామని, వారు వచ్చి ఆమెను తీసుకెళ్లిపోయారని ఆయన వివరించారు. కాగా.. ముస్లిం యువకుడిని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు బజరంగ్ దళ్ కార్యకర్తలపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం విశేషం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News