Monday, December 23, 2024

లేడీస్ లేట్‌నైట్ పార్టీపై బజరంగ్ దళ్ దాడి..

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: కర్నాటకలోని శివమొగ్గలో కువెంపు రోడ్డుపై ఉన్న ఒక హోటల్‌లో శుక్రవారం అర్ధరాత్రి జరుగుతున్న లేడీస్ పార్టీని బజరంగ్ దళ్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఇది మన హిందూ సంస్కృతికి విరుద్ధమంటూ వారు అభ్యంతరం తెలిపారు. ఆ సమయంలో హోటల్‌లో ఉన్న మహిళలు, పురుషులు, కొందరు పిల్లలను బయటకు పంపివేయగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నివారించేందుకు పోలీసులు అక్కడకు చేరుకున్నారు.

కొందరు మహిళలు లేట్ నైట్ పార్టీ జరుపుకోనున్నట్లు ఒక వారం క్రితమే పోలీసులకు తాము సమాచారం అందచేశామని బజరంగ్ దళ్ నాయకుడు రాజేష్ గౌడ విలేకరులకు తెలిపారు. మల్నాడ్ ప్రాంతంలో అటువంటి పార్టీలు జరగకూడదని, ఈ రకమైన పార్టీలకు పోలీసులు అనుమతి ఇవ్వకూడదని ఆయన చెప్పారు. ఇటువంటి పార్టీలలో మహిళలు పాల్గొనడం హిందూ సంస్కృతికి విరుద్ధమని, శివమొగ్గలో ఇలాంటి కార్యకలాపాలను బజరంగ్ దళ్ సహించబోదని ఆయన హెచ్చరించారు. ఈ పార్టీలో పాల్గొన్న మహిళల వస్త్రధారణపై కూడా ఆయన అభ్యంతరం తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News