Monday, December 23, 2024

ఆజాద్ వ్యాఖ్యలపై బజరంగ్ దళ్, విహెచ్‌పి హర్షం

- Advertisement -
- Advertisement -

జమ్మూ: జమ్మూ కశ్మీరులోని అత్యధిక ముస్లింలు హిందూ మతం నుంచి ఇస్లాంలోకి మారిపోయారంటూ డిపిఎపి అధ్యక్షుడు గులాం నబీ ఆజాద్ చేసిన వ్యాఖ్యలను హిందూత్వ సంస్థలైన బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషద్(విహెచ్‌పి) స్వాగతించాయి. ఇది సానుకూల సంకేతమంటూ గులాం ప్రకటనను అభివర్ణించాయి.

ఆజాద్ వ్యాఖ్యలు సానుకూల సంకేతమని, హిందూత్వ సంస్థల అభిప్రాయానికి ఇవి దగ్గరగా ఉన్నాయని బజరంగ్ దళ్ జాతీయ కన్వీనర్ నీరజ్ దైరేరియా తెలిపారు. దేశంలోని ముస్లింలు, క్రైస్తవులు హిందూ మతంలోనుంచే మారిపోయారన్న బజరంగ్ దళ్ ఎప్పటి నుంచో చేస్తున్న వాదనకు గులాం నబీ ఆజాద్ వ్యాఖ్యలు సానుకూల సంకేతమని దౌనేరియా అన్నారు.

కశ్మీరీ ముస్లింలు హిందువులేనని, ఇస్లాం కన్నా హిందూ మతం ఎంతో పురాతనమైనదంటూ గులాం నబీ ఆజాద్ చేసిన వ్యాఖ్యలను తాను స్వాగతిస్తున్నానని విహెచ్‌పి జాతీయ ప్రధాన కార్యదర్శి వినయాక్‌రావు దేశ్‌పాండే అన్నారు.

బిజెపి సీనియర్ నాయకుడు కవీందర్ గుప్తా కూడా ఆజాద్ వ్యాఖ్యలతో ఏకీభవించారు. దురాక్రమణదారులు ఇతర మతాలను భారత్‌లోకి తీసుకురాక పూర్వమే హిందూమతాన్ని ప్రజలు దేశంలో ఆచరిస్తున్నారని ఆయన అన్నారు. 600 ఏళ్ల క్రితం కశ్మీరులో ఉన్నవారందరూ కశ్మీరీ పండిట్లేనని, ఆ తర్వాతే వారంతా ఇస్లాంలోకి మతమార్పిడి చేసుకున్నారని ఆజాద్ చేసిన వ్యాఖ్యలు అక్షర సత్యాలని ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News