Wednesday, January 22, 2025

భజరంగ్ దళ్ కార్యకర్తను తుపాకీతో కాల్చి

- Advertisement -
- Advertisement -

జైపూర్: భజరంగ్ దళ్ కార్యకర్తను గుర్తు తెలియని వ్యక్తులు గన్‌తో కాల్చి చంపిన సంఘటన రాజస్థాన్ రాష్ట్రం ఉదయ్‌పూర్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. రాజు రాజేంద్ర పార్మర్ (38) డీలర్‌గా పని చేస్తున్నాడు. భజరంగ్ దళ్‌లో జిల్లా కన్వినర్‌గా ఉన్నాడు. అంబమాతా పోలీస్ స్టేషన్ పరిధిలో రాజును దగ్గరి నుంచి గుర్తు తెలియని ఇద్దరు దుండగులు బ్లాక్ పాయింట్‌లో తుపాకీతో కాల్చారు. దీంతో రాజు రోడ్డుపై పడిపోయాడు. వెంటనే రాజును స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు చనిపోయాడని పరీక్షించిన వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాజును కాల్చినప్పుడు అదే సమయంలో పెళ్లి బరాత్ జరుగుతుండడంతో గన్ శబ్ధం ఎవరికి వినిపించలేదు. స్థానికంగా ఉన్న సిసి కెమెరాలో పరీక్షించగా ఇద్దరు యువకులు పారిపోతున్నట్టుగా గుర్తించారు. కలివాస్ గ్రామంలో భూవివాదం విషయంలో రాజు, దీలీప్ నాథ్‌కు మధ్య గత కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. దీలీప్ నాథ్ సెంట్రల్ జైళ్లో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ మర్డర్ వెనక దీలీప్ హస్తం ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మతపరమైన హత్య కాదని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News