Wednesday, January 22, 2025

రెజ్లింగ్‌లో నాలుగు రజతాలు ఖాయం

- Advertisement -
- Advertisement -

Bajrang, Deepak, Sakshi, Anshu Malik in wrestling final

ఫైనల్లో భజరంగ్, దీపక్, సాక్షి, అన్షు మాలిక్

బర్మింగ్‌హామ్: ఊహించినట్టే కామన్వెల్త్ క్రీడల్లో భారత రెజ్లర్లు పతకాల పంట పండించారు. ఏకంగా నలుగు భారత రెజ్లర్లు ఫైనల్‌కు చేరుకుని సత్తా చాటారు. దీంతో రెజ్లింగ్‌లో భారత్‌కు కనీసం నాలుగు రజత పతకాలు ఖాయమయ్యాయి. పురుషుల విభాగంలో స్టార్ రెజ్లర్లు భజరంగ్ పునియా, దీపక్ పునియా ఫైనల్‌కు చేరుకున్నారు. మహిళల విభాగంలో అగ్రశ్రేణి రెజ్లర్లు సాక్షి మాలిక్, అన్షు మాలిక్‌లు పసిడి పతకం రేసులో నిలిచారు. పురుషుల 86 కిలోల విభాగంలో దీపక్ పునియా ఫైనల్‌కు చేరుకున్నాడు. శుక్రవారం జరిగిన సెమీ ఫైనల్లో దీపక్ 31 తేడాతో కెనడాకు చెందిన అలెగ్జాండర్ మూరేను చిత్తు చేశాడు. ఇక ఫైనల్లో దీపక్ పాకిస్థాన్‌కు చెందిన డిఫెండింగ్ చాంపియన్ మహ్మద్ ఇనామ్‌తో తలపడుతాడు. మరోవైపు పురుషుల 65 కిలోల విభాగంలో భారత అగ్రశ్రేణి రెజ్లర్ భజరంగ్ పునియా విజయం సాధించాడు. సెమీస్‌లో భజరంగ్ 100 తేడాతో ఇంగ్లండ్‌కు చెందిన జార్జ్‌ను చిత్తు చేశాడు. స్వర్ణం కోసం జరిగే పోరులో భజరంగ్ కెనడా రెజ్లర్ మెక్‌నిల్‌తో పోటీ పడతాడు. ఇక మహిళల 62 కిలోల విభాగంలో సాక్షి మాలిక్ పసిడి పోరుకు దూసుకెళ్లింది. ఏకపక్షంగా సాగిన ఫైనల్లో సాక్షి 100 తేడాతో బర్తె ఎంగొలెను ఓడించింది. 57 కిలోల విభాగంలో అన్షు మాలిక్ ఫైనల్‌కు చేరుకుంది. సెమీస్‌లో అన్షు 100 తేడాతో శ్రీలంక రెజ్లర్ నెత్మిని ఓడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News