Monday, January 20, 2025

సిఎం జగన్‌పై బక్కని నరసింహులు మండిపాటు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ పోలీట్ బ్యూరో సభ్యులు బక్కని నరసింహులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పైశాచికత్వం రానురాను పరాకాష్టకు చేరిందని ధ్వజమెత్తారు. ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుపై హత్యాయత్నం కేసు పెట్టి ఏ వన్ ముద్దాయిగా కేసు నమోదు చేయడం జగన్ శాడిజానికి పరాకాష్ట అని మండిపడ్డారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ.. సీఎం జగన్ ప్రతిపక్ష నేతపై కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారని అన్నారు.

రాజకీయంగా ఆయనను ఎదుర్కోలేక ఇలాంటి దిక్కుమాలిన చర్యలు చేపడుతున్నారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని పోలీసులు సీఎం జగన్ తొత్తుల్లా పనిచేస్తున్నారని ఘాటుగా విమర్శలు చేశారు. పోయేకాలం దాపురించింది కాబట్టే ఏపీ ప్రభుత్వం ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతుందని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఎవరిని రాజకీయంగా లక్ష్యం చేయలేదని అన్నారు. వైయస్ వివేకానంద హత్య కేసులో ఏం జరిగిందో ప్రజలందరికీ తెలుసని అయినా చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు చట్టానికి స్వేచ్ఛ కల్పించారని ఏనాడు కక్ష సాధింపు చర్యలు చేపట్టలేదని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News