Monday, December 23, 2024

బక్రీద్ పండుగ శుభాకాంక్షలు: మంత్రి హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

త్యాగానికి ప్రతీక బక్రీద్ పండుగ

అల్లా దయతో తెలంగాణ సుభిక్షంగా ఉండాలి

హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ముస్లిం సోదర, సోదరీమణులకు ఈద్ ఉల్ అధా (బక్రీద్‌ )పండుగ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగం, సహనం బక్రీద్‌ పండుగ ఇచ్చే సందేశాలన్నారు. ‘‘దైవ ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ.. ఈ పండుగ జరుపుకొంటారన్నారు. భక్తి భావం, విశ్వాసం, కరుణ, ఐక్యతకు సంకేతమైన ఈ పండుగను భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకోవాలన్నారు. ఈ పండుగ సోదర భావం,ఐక్యతకు ఆదర్శంగా నిలుస్తుంది” అని అన్నారు. అల్లాహ్ ఆశీస్సులు ప్రజలందరికీ ఎల్లప్పుడూ ఉండాలని అభిలషించారు. అల్లా దయతో తెలంగాణ రాష్ట్రం సుబిక్షంగా ఉండాలని ప్రార్థిస్తున్నానని హరీష్ రావు పేర్కొన్నారు.

Also Read:

మంచి దొంగలు: ఎదురు డబ్బిచ్చి పారిపోయారు( వైరల్ వీడియో)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News