Monday, December 23, 2024

త్యాగానికి ప్రతీక బక్రీద్ పండుగ

- Advertisement -
- Advertisement -

పెద్దపల్లి: బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని మసీద్ ఆవరణలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన ముస్లీంలు ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు నల్ల మనోహర్‌రెడ్డి, ఇతర నాయకులు వేర్వేరుగా కలిసి అలాయి బలాయి తీసుకొని ముస్లీంలకు ఈద్ ఉల్ అధా శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భగా వారు మాట్లాడుతూ బక్రీద్ పండుగ త్యాగం, సహనాలను ఇచ్చే సందేశాలను అందిస్తుందని అన్రు. దైవ ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ ముస్లీంలు ఈ పండుగ జరుపుకొంటారన్నారు. భక్తి భావంతో విశ్వాసం, కరుణ, ఐక్యత సాంకేతమైనీ పండుగను భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ముస్లీంలు, మత పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News