Tuesday, November 5, 2024

త్యాగాలకు ప్రతీక బక్రీద్ పండుగ

- Advertisement -
- Advertisement -

కామారెడ్డి : సమిష్టి ప్రయోజనం కోసం వ్యక్తిగత స్వార్థాన్ని విడిచి త్యాగాలకు సిద్దపడటమే సమాజ హితమని మాజి మంత్రి షబ్బీర్ అలీ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని కోర్టు ఆవరణలో గల ఈద్గాలో బక్రీద్ పండుగ సందర్భంగా నమాజ్ చేసి అందరికి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్యాగాల ద్వారా ప్రాప్తించిన ప్రయోజనాలు సమస్త జనులకు సమానంగా అందినప్పుడే ఆ త్యాగాలకు సార్థకత చేరూరుతుందనే సందేశాన్ని బక్రీద్ పండుగ శిశ్వమానవాళికి అందిస్తుందని తెలిపారు. బక్రీద్ పండుబ భక్తి,  కరుణ, విశ్వాసం అనే గొప్ప గుణాలను ప్రజల్లో పెంపొందిస్తందని అన్నారు. సకల మత విశ్వాసాలను, సాంప్రదాయాలను గౌరవిస్తూ రాష్ట్రంలో దేశంలోనే పాలన కొనసాగాలని పేర్కొన్నారు. అన్ని వర్గాలు ప్రజలు శాంతియుతంగా కలసిమెలసి జీవించేలా గంగా జమునా తహజీబ్‌ను కాపాడాలంటూ అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని అల్లాహ్‌తో ప్రార్థించానని చెప్పారు. తెలంగాణ ఆద్యాత్మిక పరంపరను కొనసాలని అల్లాహ్ దయ ప్రజలందరిపై ఉండాలని, ప్రజలంతా సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News