Wednesday, January 22, 2025

త్యాగానికి ప్రతీక బక్రీద్ పండుగ….

- Advertisement -
- Advertisement -

మంచాల: మండల పరిధిలోని ఆరుట్ల, చాంద్‌ఖాన్ గూడ, జాపాల, మంచాల తదితర గ్రామాల్లో గురువారం బక్రీద్ పర్వదినం సందర్భంగా ముస్లీంలు మసీదులు, దర్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఒకరికొకరు అలయ్ బలయ్ చేసుకొని శుభాకాంక్షలు తెలిపారు. ఎంతో భక్తిశ్రద్ధలతో బక్రీద్ వేడుకలను నిర్వహించారు.

ఈ వేడుకల్లో ఆరుట్ల సర్పంచ్ కొంగర విష్ణువర్ధన్ రెడ్డి, బిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు చీరాల రమేష్, ఆరుట్ల ఉప సర్పంచ్ పాండాల జంగయ్య గౌడ్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు మాదగోని జంగయ్యగౌడ్, మార్కెట్ కమిటీ డైరక్టర్ ఎండి జానీపాషా, మండల మాజీ కోఆప్షన్ సభ్యులు ఎండి సలాం పాల్గొని ముస్లీం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బక్రీద్ పండుగ భక్తిభావం, విశ్వాసం, కరుణ, ఐక్యతకు సంకేతం అన్నారు.

ప్రతి ఒక్కరూ సన్మార్గంలో జీవించాలనే సందేశాన్ని బక్రీద్ చాటుతుందన్నారు. రాగదేషాలకు అతీతంగా అల్లా ఆశీస్సులు ప్రజలందరికీ ఎప్పుడూ ఉండాలని ప్రార్థించారు. పవిత్రమైన రంజాన్ తరువాత రెండో అతిపెద్ద పండుగ బక్రీద్ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పుణ్ణం రాము, బైకని మహేందర్, వార్డు సభ్యులు సద్దాం, నర్సింహ, శివ, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News