Wednesday, January 22, 2025

బక్రీద్‌ను ప్రశాంతంగా జరుపుకోవాలి

- Advertisement -
- Advertisement -

Bakrid should be celebrated peacefully

హైదరాబాద్ : ముస్లిం సోదరులు ప్రశాంత వాతావరణంలో బక్రీద్‌ను జరుపుకోవాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ అన్నారు. బక్రీద్ పండగ సందర్భంగా ముస్లీం మత పెద్దలు, అన్ని శాఖల అధికారులతో కలిసి మంగళవారం సాలార్‌జంగ్ మ్యూజియంలో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీధులను శుభ్రంగా ఉంచేందుకు సహకరించాలని, జంతువుల విసెరాను సక్రమంగా పారవేయాలని కోరారు. 300 శానిటేషన్ వాహనాలు ఏర్పాటు చేశామని, అదనంగా 55 వాహనాలను పిఎస్‌లకు కేటాయించామని తెలిపారు. చెత్తను సులభంగా వేసేందుకు సంచులను పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉంచామని, సౌత్‌జోన్‌లో రెండు లక్షల చెత్త సంచులను పంపిణీ చేసేందుకు ప్లాన్ తయారు చేస్తున్నట్లు తెలిపారు. పోలీసులు, జిహెచ్‌ఎంసి, పశుసంవర్దక సిబ్బంది చెక్‌పోస్టుల్లో విధులు నిర్వర్తిస్తారని తెలిపారు. పశువులను ఎవరైనా అక్రమంగా రవాణా చేస్తున్నట్లు సమాచారం వస్తే వెంటనే పోలీసులకు చెప్పాలని కోరారు. పశువుల అక్రమ రవాణాపై ఇతర విభాగాలతో కలిసి 21మంది అధికారులను నియమించామని తెలిపారు.

బందోబస్తు ఏర్పాట్లు, భద్రత, పార్కింగ్,ట్రాఫిక్‌కు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశామని, నిర్భందానికి కాదని తెలిపారు. విద్యుత్ అధికారులు సమస్య ఉన్న ప్రాంతాల్లో వెంటనే పరిష్కరిస్తారని తెలిపారు. ముగింపు వరకు, కోవిడ్‌ను దూరంగా ఉంచడానికి భద్రతా ప్రోటోకాల్‌లను అనుసరించాలని సిటీ టాప్ పోలీసులు విజ్ఞప్తి చేశారు. అదనపు పోలీస్ కమిషనర్లు డి.ఎస్ చౌహాన్, ఎ.ఆర్. శ్రీనివాస్, జాయింట్ సిపిలు కార్తికేయ, M.రమేష్ P.విశ్వ ప్రసాద్ స్పెషల్ బ్రాంచ్, జోయెల్ దేవిస్ డిసిపి వెస్ట్ జోన్, M.రాజేష్ చంద్ర డిసిపి సెంట్రల్ జోన్, శ్రీమతి. చందన దీప్తి డిసిపి నార్త్ జోన్, సాయి చైతన్య డిసిపి సౌత్ జోన్, G.చక్రవర్తి డిసిపి ఈస్ట్ జోన్, ఎం.రాధాకృష్ణారావు ఓఎస్‌డి టాస్క్ ఫోర్స్, సునీతారెడ్డి డిసిపి టాస్క్‌ఫోర్స్, అశోక్ సామ్రాట్ జిహెచ్‌ఎంసి జోనల్ కమిషనర్, ఆర్టిసి, అగ్నిమాపక శాఖ, ఆర్ అండ్ బి, ప్రొహిబిషన్ & ఎక్సైజ్, హెల్త్, బిఎస్‌ఎన్‌ఎల్ అధికారులు, మత పెద్దలు శ్రీ.జైముతుల్ ఖురేషీ, శ్రీ.సయ్యద్ అహ్మద్ పాషా క్వాద్రీ ఎమ్మెల్యే యాకుత్‌పురా, శ్రీ.మహ్మద్ సలీమ్, ఎమ్మెల్సీ వక్ఫ్ బోర్డు చైర్మన్, శ్రీ.హఫీజ్ ముజాఫర్ బండే నవాజ్ వైస్ ఛాన్సలర్, జామియా నిజామియా, శ్రీ.ముఫ్తీ ఖలీల్ అహ్మద్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News