Friday, December 20, 2024

త్యాగానికి ప్రతీక బక్రీద్

- Advertisement -
- Advertisement -

మహబూబ్‌నగర్  : త్యాగానికి ప్రతీకగా జరుపుకునే బక్రీద్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులకు మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్‌గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు. గురువారం స్థానిక కొత్త గంజి సమీపంలో ఉన్న ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసిన తర్వాత ముస్లిం సోదరులకు మంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. అ నంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ బక్రీద్ త్యాగాలకు ప్రతీకగా నిలుస్తుందని, మనకు కలిగిన ప్రయోజనాలను జనులందరికీ సమానంగా అం దించినప్పుడే సార్థకత చేకూరుతుందనే సందేశాన్ని ఈ పండుగ ఇస్తుందన్నారు. బక్రీద్ భక్తి, త్యాగం , కరుణ, విశ్వాసం అనే గొప్ప గుణాలను ప్రజల్లో పె ంపొందిస్తుందని అన్నారు.

రాష్ట్రం సిద్ధ్దించిన త ర్వాత ఆ సమస్యలన్నీ తీరాయన్నారు. ఎన్నికలప్పుడు పండుగలు వచ్చాయంటే ఎప్పుడు ఏ ఆందోళన జరుగుతుందని భయం భయంగా ఉండేదని ఇప్పుడు హిందూ ముస్లిం బాయ్ బాయ్ అన్న తీ రుగా పట్టణంలో ప్రశాంత వాతావరణం నెలకొనే లా చేశామన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ముఖ్యమంత్రి కెసిఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ మరింత అభివృద్ధి సాధించాలని ఈ సందర్భంగా మంత్రి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్, జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, ముడా చైర్మన్ గంజి వెంకన్న, మున్సిపల్ చైర్మన్ గణేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ రహమాన్, వైస్ చైర్మన్ గిరిధర్‌రెడ్డి, ఎస్పీ కె. నర్సింహ, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్‌కుమార్, డీఎస్పీ మహేష్, కౌన్సిలర్లు , ప్రజా ప్రతినిధులు, అధికారులు ఉన్నారు. రు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News