Friday, December 20, 2024

త్యాగం, సహనానికి ప్రతీక బక్రీద్

- Advertisement -
- Advertisement -

వికారాబాద్: బక్రీద్ పండుగ సందర్భంగా వికారాబాద్ జిల్లాలో ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు దగ్గరికి వెళ్లి ప్రార్థనలు చేసి తమకు తోచిన వస్తువులను పేదలను పంచిపెట్టారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ముస్లిం సోదరులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బక్రీద్ పండుగను పవిత్రంగా భావిస్తారని శాంతి ప్రేమకు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. పవిత్ర బక్రీద్ పర్వదినం సందర్బంగా వికారాబాద్ పట్టణంలోని ఆలంపల్లి దర్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపి, అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News