Sunday, December 22, 2024

అప్పు ఇచ్చినందుకు ప్రాణం తీసిన రైల్వే పోలీస్

- Advertisement -
- Advertisement -

లక్నో: ఏడు వేల రూపాయల అప్పు కోసం కూరగాయలు అమ్మే మహిళను రైల్వే పోలీస్ ఇటుకతో కొట్టి చంపిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లక్నోలోని బక్షి కా తలాబ్ రైల్వే స్టేషన్‌లో జరిగింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఫయిజుల్లాగంజ్ ప్రాంతం దవూద్ నగర్‌లోని లోమర్‌మౌకు చెందిన హరూన్ అలీ అనే వ్యక్తి రైల్వే పోలీస్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. లకిమ్‌పూర్‌కు చెందిన సుశీలా దేవి(40) అనే మహిళ లక్నోలో ఉంటూ కూరగాయాల వ్యాపారం చేస్తోంది. అలీ కొంత కాలం నుంచి ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడు. మహిళ ఇంటి పక్కనే హరూన్ అలీ ఉండడంతో ఇద్దరికి పరిచయం ఉంది.

Also Read: చిన్న షాప్‌కు కోటి రూపాయల కరెంట్ బిల్లు

దీంతో సదరు మహిళ వద్ద నుంచి అలీ ఏడు వేల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. అప్పు ఇచ్చిన డబ్బులు ఇవ్వాలని పలుమార్లు అతడిని సుశీలా దేవి నిలదీసింది. అతడు అప్పుడు చెల్లించకపోవడంతో పోన్ చేసినా కూడ స్పందించకుండా నంబర్‌ను బ్లాక్ చేశాడు. దీంతో తన డబ్బులు తనకు ఇవ్వాలని అతడిపై ఒత్తిడి తీసుకొచ్చింది. బక్షి కా తలాబ్ రైల్వే స్టేషన్‌కు రావాలని ఆమెకు అతడు కబురు పంపాడు. ఆమె రైల్వే స్టేషన్‌కు చేరుకున్న తరువాత ఇద్దరు మధ్య వాగ్వాదం జరిగింది. ఘర్షణ తారాస్థాయికి చేరుకోవడంతో ఆమె తలపై ఇటుకతో కొట్టి అక్కడి నుంచి అలీ పారిపోయాడు. ఆమె ఘటనా స్థలంలోనే చనిపోయింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హరూన్ మాత్రం పరారీలో ఉన్నాడని రైల్వే పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News