Wednesday, January 22, 2025

కామెడీ ఎంటర్‌టైనర్..

- Advertisement -
- Advertisement -

ఖయ్యూమ్, నవీన్ నేని, రోయిల్ శ్రీ, చింటు, శాంతి దేవగుడి, రామ్ జగన్, చిత్రం శ్రీను ప్రధాన పాత్రల్లో యాక్టివ్ స్టూడియోస్ బ్యానర్‌పై తెరకెక్కుతోన్న చిత్రం ‘భళా చోర భళా’. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ మిస్టరీ చిత్రానికి ఏ. ప్రదీప్ దర్శకత్వం వహిస్తుండగా.. ఏ. జనని ప్రదీప్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈనెల 26న విడుదల చేయబోతున్నట్లుగా తెలుపుతూ.. చిత్ర ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఖయ్యుమ్ మాట్లాడుతూ.. “దర్శకుడు ప్రదీప్ నాకు ఏవీఎస్ అబ్బాయిగా 20 ఏళ్ల క్రితమే తెలుసు. అతను చెప్పిన కథ బాగా నచ్చి ఈ సినిమా చేశాను”అని అన్నారు. డైరెక్టర్ ప్రదీప్ మాట్లాడుతూ “తక్కువ బడ్జెట్‌లో తక్కువ రోజుల్లో రూపొందుకున్న మంచి సినిమా ‘భళా చోర భళా’. ఈ సినిమాను ఈనెల 26న మా అమ్మగారి పుట్టినరోజు కానుకగా విడుదల చేయనున్నాము” అని చెప్పారు.

Bala Chora Bala Movie to release on Aug 26

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News