Monday, January 20, 2025

బాబీతో మూవీ దసరాకు విడుదల?

- Advertisement -
- Advertisement -

స్టార్ హీరో బాలకృష్ణ ప్రస్తుతం హ్యాట్రిక్ హిట్స్‌తో దూసుకుపోతున్నారు. దర్శకుడు అనిల్ రావిపూడితో గత ఏడాది భగవంత్ కేసరి సిని మా చేసి బ్లాక్‌బస్టర్ హిట్‌ని ఆయన తన ఖాతాలో వేసుకున్నారు. ఇప్పుడు బాబీ దర్శకత్వంలో సినిమాని సెట్స్‌పైకి తీసుకొని వెళ్లారు. చిరంజీవితో ‘వాల్తేర్ వీరయ్య’ లాంటి హిట్ మూవీ తర్వాత బాబీ చేస్తోన్న సినిమా ఇది. ఈ మూవీ ఇప్పటి వరకు 30 శాతం షూటింగ్ పూర్తి చేసుకుందని తెలిసిం ది. ఇక ఏపిలో జరిగే ఎన్నికల్లో బాల య్య మళ్ళీ హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు. దీంతో ఎన్నికల సమయంలో బాల య్య కాంబినేషన్ లేని సన్నివేశాలు షూటింగ్ చేయాలని డైరెక్టర్ బాబీ ప్లాన్ చేసుకుంటున్నారట. ఎన్నికలు పూర్తయిన అయిన తర్వాత మరల షూటింగ్ ప్రారంభించి వేగంగా పూర్తి చేసి దసరాకి మూవీని ప్రేక్షకుల ముం దుకి తీసుకురావాలని అనుకుంటున్నారని తెలిసింది. పూర్తి మాస్ కమర్షియ ల్ యాక్షన్ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాను సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News