Sunday, December 29, 2024

దాసరి లేనిలోటు కనిపిస్తుంది: బాలకృష్ణ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు, దివంగత దాసరి నారాయణరావును నందమూరి బాలకృష్ణ గుర్తు చేస్తుకున్నారు. దాసరి లేని లోటు పరిశ్రమలో కనిపిస్తుందని తెలిపారు. ఆయన పరిశ్రమకు పెద్ద దిక్కుగా ఉండడంతో పాటు తలలో నాలుకలా ఉండేవారని చెప్పి భావోద్వేగానికి లోనయ్యారు. భగవంత్ కేసరి సినిమా సక్సెస్‌ఫుల్‌గా థీయేటర్లలో ఆడుతుండడంతో సినిమా యూనిట్ హైదరాబాద్‌లో వేడుక నిర్వహించింది. ఈ సందర్భంగా బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దర్శక ధీరుడు కె రాఘవేంద్రరావు, నిర్మాత అంబికా కృష్ణ వచ్చారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి, నటుడు ఎన్‌టిఆర్‌తో రాఘవేంద్రరావు ఎన్నో సినిమాలు తీశారని, ఈ కార్యక్రమానికి రావడంతో సంతోషంగా ఉందని బాలకృష్ణ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా బాలకృష్ణ ప్రసంగించారు. తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు కొత్తదనాన్ని కోరుకుంటారని, వాళ్లు అడిగేవరకు ఆగకుండా ముందే మన ఇస్తే ఫలితం ఇలా ఉంటుందని చెప్పుకొచ్చారు. మంచి సినిమాకు ప్రేక్షకులు నీరాజనాలు పలుకుతుంటే అంతకు మించిన సంపద, సంతోషం ఏమీ ఉండదన్నారు. వైవిధ్యమైన ప్రాతలు చేసే దమ్ము, ధైర్యం నాన్న నుంచి తనకు వచ్చామని బాలకృష్ణ చెప్పారు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి తనకు సవాల్ విసిరన సినిమాలు అని బాలకృష్ణ తెలిపారు. బాలకృష్ణ సినిమా అంటేనే వేరు అని, షడ్రుచులు ఉండాలని, అలాంటి సినిమానే అనిల్ రావుపూడి అందించారని కొనియాడారు. ఈ సినిమాలో బాలకృష్ణ పక్కన కాజల్, శ్రీలీలలు నటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News