- Advertisement -
బెంగళూరు: కర్నాటక కాంగ్రెస్ ఎంఎల్‌ఎ బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. బిజెపి, సంఘ్‌పరివార్ పంచుతున్న ఆక్షింతలు కావాలా? లేక ఐదు గ్యారెంటీలు కావాలో తేల్చుకోవాలని సూచించారు. అయోధ్యలో రామమందిరం కట్టడంతో తాము కూడా సంతోషంగా ఉన్నామని, రామమందిరం పేరుతో రాజకీయం చేసి ఓట్లు అడగడం బాగోలేదని విమర్శించారు. ఓటర్లు ఆలయానికి ఓట్లు వేస్తే ప్రజలు ఐదు గ్యారెంటీలను తిరస్కరించాయని ప్రతిపక్షాలు అంటాయని చెప్పారు. వచ్చే లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు ఇవ్వకుంటే ఐదు గ్యారెంటీలు నిలిపివేస్తామని హెచ్చరించారు. ఈ అంశంపై సిఎం సిద్ధరామయ్య, డిప్యూటీ డికె శివ కుమార్‌తోను మాట్లాడానని వివరించారు. ఓటర్లు అక్షింతలకు ఓటు వేస్తారా? లేక ఐదు గ్యారెంటీలకు ఓటు వేస్తారా? అని బాలకృష్ణ ప్రశ్నించారు. మగది అసెంబ్లీ స్థానం నుంచి బాలకృష్ణ గెలుపొందారు.
- Advertisement -