Monday, January 20, 2025

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో హీరో బాలకృష్ణ భేటీ

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్:  టాలీవుడ్ స్టార్ హీరో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆదివారం భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్‌లోని సిఎం నివాసంలో రేవంత్ రెడ్డిని కలిసిన బాలకృష్ణ పుష్పగుచ్చం ఇచ్చి అభినందించారు. తెలంగాణకు రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత బాలకృష్ణ రేవంత్‌రెడ్డిని కలవడం ఇది రెండోసారి. తెలంగాణ, ఎపి రాష్ట్రాల తాజా రాజకీయ పరిస్థితులపై వారిద్దరూ చర్చించినట్లుగా తెలిసింది. ఎపిలో ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయని రేవంత్ బాలయ్యను అడిగినట్లు సమాచారం. మరోవైపు వీరిద్దరి మధ్య సినిమా సంగతులు కూడా చర్చకు వచ్చినట్లు తెలిసింది. దీంతోపాటు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలు కల్పన కోసం గత ప్రభుత్వ హయాంలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి యాజమాన్యం దరఖాస్తు చేసుకుంది. కాగా, ఆ దరఖాస్తును త్వరలోనే ఆమోదిస్తామని రేవంత్ రెడ్డి బాలకృష్ణకు హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News