Sunday, February 23, 2025

అరెస్టు చేస్తే భయపడం: బాలకృష్ణ

- Advertisement -
- Advertisement -

అమరావతి: టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టు దుర్మార్గమని సినీ నటుడు, ఎంఎల్‌ఎ నందమూరి బాలకృష్ణ మండిపడ్డారు. ప్రజా సంక్షేమాన్ని సిఎం జగన్ మోహన్ రెడ్డి గాలికొదిలేశారని దుయ్యబట్టారు. ప్రతిపక్షనేతలపై కక్షసాధింపులకే జగన్ పరిమితమయ్యారని, చంద్రబాబును ఎలాగైనా జైళ్లో ఉంచాలనేదే జగన్ కుట్ర అని ధ్వజమెత్తారు. ఆధారాలు లేకుండా ఏ చట్టప్రకారం చంద్రబాబును అరెస్టు చేస్తున్నారని అడిగారు. నిజంగా అవినీతి జరిగి ఉంటే ఇంతవరకు చార్జిషీట్ ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. వైసిపి ప్రభుత్వం చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేస్తే భయపడే ప్రసక్తే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయపోరాటం చేసి ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామని హెచ్చరించారు.

Also Read: చంద్రబాబు అరెస్టు సరికాదు: పురందేశ్వరి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News