Wednesday, January 22, 2025

కక్ష సాధింపులే జగన్ లక్ష్యం: బాలకృష్ణ

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ కోసం ప్రతి ఒక్కరూ ఉద్యమించాల్సిన సమయం వచ్చిందని నటుడు, టిడిపి ఎంఎల్‌ఎ బాలకృష్ణ పిలుపునిచ్చారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబునాయుడును అరెస్టు చేసిన నేపథ్యంలో బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు.  మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సానుభూతి తెలిపిన ప్రతి ఒక్కరినీ కలుస్తానని హామీ ఇచ్చారు. తాను వస్తున్నానని, ఎవరూ భయపడాల్సిన పని లేదని, తెలుగువాడి సత్తా, పౌరుషాన్ని చూపెడుదామన్నారు.

Also Read:టిడిపి బంద్‌ను ఎవరూ పట్టించుకోలేదు: కారుమూరి

అభివృద్ధి, సంక్షేమానికి చంద్రబాబు ఒక బ్రాండ్‌లా ఉన్నారని బాలకృష్ణ ప్రశంసించారు. కక్ష సాధింపులే సిఎం జగన్ లక్ష్యమని, ఎన్నికల్లో పరాజయం తప్పదన్న భయంతోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. జగన్ 16 నెలలు జైలులో ఉండి వచ్చారని, చంద్రబాబును 16 రోజులైనా జైలులో ఉంచాలని జగన్ కుట్ర పన్నుతున్నారని బాలకృష్ణ ధ్వజతమెత్తారు.  చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటపడుతారని, ఇలాంటివి ఎన్నో చూశామని… ఎవరికీ భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. న్యాయ పోరాటం చేస్తామని, మెరిగితే పట్టించుకోనని, అతిక్రమిస్తే ఉపేక్షించనని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News