Monday, December 23, 2024

దిల్‌రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌లో ‘బలగం’

- Advertisement -
- Advertisement -

ప్రముఖ నిర్మాత దిల్ రాజు 2003లో శ్రీ వెంకటేశ్వర ఆర్ట్ నిర్మాణ సంస్థను స్థాపించి హిట్ మూవీ ‘దిల్’తో టాలీవుడ్‌లో తన కెరీర్‌ను ప్రారంభించారు. ఆతర్వాత పలు విజయవంతమైన చిత్రాలతో ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. ఇప్పుడు ఆయన కుటుంబంలోని రెండవ తరం చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతోంది. కొత్తగా ప్రారంభించిన దిల్‌రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు కూతురు హన్షిత, హర్షిత్ రెడ్డిలు నిర్మాతలుగా ‘బలగం’ సినిమాతో తమ కెరీర్‌ను మొదలు పెడుతున్నారు. శిరీష్ సమర్పణలో వేణు ఎల్దండి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రియదర్శి, కావ్యలు హీరోహీరోయిన్లు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటైన విలేకరుల సమావేశంలో దిల్‌రాజు, శిరీష్, హన్షిత, హర్షిత్ రెడ్డి, వేణు ఎల్దండి, ప్రియదర్శి, కావ్యతో పాటు చిత్ర బృందం పాల్గొంది.

ఈ కార్యక్రమంలో దిల్‌రాజు మాట్లాడుతూ “కుటుంబ కథా చిత్రాలకు పేరుగాంచిన శ్రీ వెంకటేశ్వర ఆర్ట్ బ్యానర్ తర్వాత మా కుటుంబం నుంచి వస్తున్న కొత్త నిర్మాణ సంస్థ దిల్‌రాజు ప్రొడక్షన్స్. మా కుటుంబంలోని హన్షిత, హర్షిత్ రెడ్డిలు నిర్మాతలుగా నేటి ట్రెండ్‌కు తగ్గట్టు కొత్త తరహా చిత్రాలను నిర్మించడం జరుగుతుంది. దిల్‌రాజు ప్రొడక్షన్స్‌లో వస్తున్న మొదటి చిత్రం ‘బలగం’ కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది”అని అన్నారు. దర్శకుడు వేణు ఎల్దండి మాట్లాడుతూ “సిరిసిల్ల సమీపంలోని ఓ ఊరు నేపథ్యంలో ‘బలగం’ సినిమా కొనసాగుతుంది. తెలంగాణ యాసలో కొనసాగే ఈ సినిమా అందరికీ కనెక్ట్ అయ్యే విధంగా తెరకెక్కుతోంది”అని చెప్పారు. నిర్మాత హన్షిత, హర్షిత్ రెడ్డిలు మాట్లాడుతూ “కొత్త టాలెంట్‌ను ప్రోత్సహిస్తూ కొత్త తరం ప్రేక్షకులను ఆకట్టుకునేవిధంగా దిల్‌రాజు ప్రొడక్షన్స్‌లో సినిమాలు నిర్మిస్తాం. మా మొదటి సినిమా ‘బలగం’ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా రూపుదిద్దుకుంటోంది”అని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News